Tech Tips in Telugu : మీ గూగుల్ క్రోమ్ స్లో అయిందా? ఈ సింపుల్ సెట్టింగ్ మార్చుకోండి చాలు.. జెట్ స్పీడ్‌తో పనిచేస్తుంది..!

Google Chrome : మీ గూగుల్ క్రోమ్ స్లోగా పనిచేస్తుందా? అయితే, క్రోమ్ బ్రౌజర్‌లో ఈ సింపుల్ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకుంటే చాలు.. క్రోమ్ వేగంగా ఓపెన్ అవుతుంది. వెబ్ పేజీలు కూడా జెట్ స్పీడ్‌తో లోడ్ అవుతాయి.

Tech Tips in Telugu : మీ గూగుల్ క్రోమ్ స్లో అయిందా? ఈ సింపుల్ సెట్టింగ్ మార్చుకోండి చాలు.. జెట్ స్పీడ్‌తో పనిచేస్తుంది..!

Tech Tips in Telugu

Updated On : September 18, 2024 / 11:33 PM IST

Google Chrome  : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే వెబ్ బ్రౌజర్ క్రోమ్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రౌజర్‌లలో ఒకటి. ప్రస్తుతం క్రోమ్ యూజర్లకు అందరికి అందుబాటులో ఉంది. వెబ్ పేజీలను వేగంగా లోడ్ చేయడంలో క్రోమ్ యూజర్ ఫ్రెండ్లీగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే, ఈ క్రోమ్ బ్రౌజర్ కొన్నిసార్లు వెబ్ పేజీలను ఓపెన్ చేసినప్పుడు బాగా స్లో అవుతుంటుంది.

చాలామంది వినియోగదారులు ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఎక్కువ మొత్తంలో ట్యాబ్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ సమస్య కనిపిస్తుంటుంది. బ్రౌజర్ నెమ్మదించినప్పుడు చిన్నపాటి సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా వెబ్ పేజీలను వేగంగా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఈ క్రోమ్‌ను చాలా మంది మెమరీ హాగ్‌గా పరిగణిస్తారు.

Read Also : Lava Blaze 3 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా బ్లేజ్ 3 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

క్రోమ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ త్వరగా రెస్పాండ్ అవుతుంది. అయితే, ‘హార్డ్‌వేర్ యాక్సిలరేషన్’ అనే ఫీచర్ క్రోమ్ బ్రౌజర్‌ను మరింత వేగవంతం చేస్తుంది. ఇది డిఫాల్ట్‌గా, వెబ్‌పేజీలు, కంటెంట్‌ను రెండర్ చేయడానికి క్రోమ్ మీ మెషీన్ సీపీయూ, సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తుంది.

‘హార్డ్‌వేర్ యాక్సిలరేషన్’ని ఎనేబుల్ చేయడం వల్ల వెబ్ పేజీలను లోడ్ చేయడానికి మీ మెషీన్ గ్రాఫిక్ కార్డ్‌ని ఉపయోగించుకునేలా బ్రౌజర్‌ని అలర్ట్ చేస్తుంది. ఫలితంగా మెరుగైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు తరచుగా గ్రాఫిక్-హెవీ వెబ్ పేజీలను విజిట్ చేయడం లేదా బ్రౌజర్‌లో వీడియోలను వీక్షిస్తే ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

క్రోమ్‌లో హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ సెట్టింగ్ ఎలా ఎనేబుల్ చేయాలంటే? :
1. మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.. స్క్రీన్ కుడి ఎగువ భాగంలో కనిపించే వర్టికల్ త్రి డాట్స్ బటన్‌పై క్లిక్ చేయండి.
2. ఇప్పుడు, ‘Settings’పై క్లిక్ చేసి, లెఫ్ట్ ప్యానెల్‌లో కనిపించే ‘System’ ట్యాబ్‌కు వెళ్లండి.
3. అదే వెబ్ పేజీలో మీరు ‘Use hardware acceleration when available’ అనే ఆప్షన్ చూడవచ్చు. దీన్ని ఆన్ చేసి, క్రోమ్ మళ్లీ రీలాంచ్ చేయండి.

బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేసిన తర్వాత అదే పేజీలో హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ ఎనేబుల్ చేసి ఉందో లేదో నిర్ధారించవచ్చు. వినియోగదారులు క్రోమ్ అడ్రస్ బార్‌లో ‘chrome://gpu’ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ ఫీచర్ ఎనేబుల్ అయితే.. మీకు ‘Graphic Feature Status’ సెక్షన్‌లో గ్రీన్ కలర్ టెక్స్ట్‌లో ‘Hardware accelerated’ అనే ఆప్షన్ చూడవచ్చు.

ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసేందుకు టర్న్ ఆన్ ఆప్షన్ నొక్కండి. మీ క్రోమ్ బ్రౌజర్ వేగంగా ఓపెన్ కావడంతో పాటు వెబ్ పేజీలు ఓపెన్ చేసిన ట్యాబ్‌లు కూడా వేగంగా లోడ్ అవుతాయి. క్రోమ్ యూజర్లు తమ బ్రౌజర్‌‌లో హార్డ్‌వేర్ యాక్సిలరేషన్ ఎనేబుల్ చేసిన తర్వాత అవాంతరాలు లేదా బ్రౌజర్ క్రాష్‌లు లేదా క్రోమ్ స్తంభించడం వంటి సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది.

Read Also : Russia Birth Rate : వర్క్ బ్రేక్ తీసుకోండి.. పిల్లల్ని కనేందుకు ప్రయత్నించండి.. దేశ జనన రేటు పెంచాలంటూ రష్యా వింత వినతి..!