WhatsApp for iPad : ఇది విన్నారా? ఐప్యాడ్‌లోనూ వాట్సాప్ సర్వీసులు.. ఈ కొత్త యాప్ ఎలా వాడాలంటే?

WhatsApp for iPad : ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త యాప్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఈ యాప్‌ను ఉపయోగించడానికి, యూజర్లు తమ ఐఫోన్, ఐప్యాడ్‌లో యాప్ బీటా iOS వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.

WhatsApp for iPad is now available for some users, here’s how you can use it

WhatsApp for iPad : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా మారింది. మెటా యాజమాన్యంలోని వాట్సాప్ స్మార్ట్‌ఫోన్, డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు అయినప్పటికీ ప్లాట్‌ఫారమ్‌లో యాక్టివ్‌గా ఉన్న 2.7 బిలియన్ నెలవారీ యూజర్లను కలిగి ఉంది. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా (Apple iPad) యూజర్లు PadOS వెర్షన్ కోసం అడుగుతున్నారు. వాట్సాప్ త్వరలో ఈ వెర్షన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Wabetainfo ప్రకారం.. వాట్సాప్ ఐప్యాడ్‌ల కోసం ఒక వెర్షన్‌పై పని చేస్తోందని, ఇప్పటికే బీటా టెస్టింగ్‌ను ప్రారంభించిందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే తమ మొబైల్ డివైజ్‌ల్లో బీటా యాప్‌ని ఉపయోగించగల బీటా టెస్టర్లందరికీ ఐప్యాడ్‌కు కస్టమైజ్డ్ బీటా వెర్షన్ టెస్ట్‌ఫ్లైట్ యాప్ ద్వారా ఇన్‌స్టాల్ అవుతుంది.

Read Also : WhatsApp Chat Ads : వద్దు బాబోయ్‌.. వాట్సాప్ చాట్‌లో యాడ్స్ కనిపిస్తాయా? యూజర్ల ప్రైవసీకి భద్రత లేనట్టేనా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే?

ఇంతకుముందు, ఐప్యాడ్ యూజర్లు వెబ్ వెర్షన్‌పై ఆధారపడవలసి వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకమైన iPadOS యాప్ అందుబాటులో లేదు. ఐఫోన్ వెర్షన్ ఆపిల్ టాబ్లెట్‌కి అనుకూలంగా లేదు. అయితే, iPadOS ప్రత్యేకమైన వాట్సాప్ యాప్‌తో, వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్‌లను ఏదైనా ఆపిల్ డివైజ్‌లో యాక్సెస్ చేయగలరు. ప్రత్యేకించి వాట్సాప్ ఇప్పటికే iOS, macOS యాప్‌లను కలిగి ఉంది. అయితే, వాట్సాప్ అధికారికంగా iPadOS వెర్షన్‌ను త్వరలో లాంచ్ చేయనుంది. నివేదిక ప్రకారం.. యాప్ డౌన్‌లోడ్‌‌కు అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు ఐఫోన్, iPad రెండింటిలోనూ WhatsApp బీటా iOS వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత, వారి ఐఫోన్‌లో, వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఆపై సెట్టింగ్‌లకు నావిగేట్ చేయాలి. లింక్ చేసిన డివైజ్‌లను ఎంచుకుని, డివైజ్ Add Link క్లిక్ చేయాలి. యూజర్లు తమ ఐప్యాడ్‌ని ఉపయోగించి QR కోడ్‌ని స్కాన్ చేయడానికి అనుమతిస్తుంది. ఐప్యాడ్‌ను ఐఫోన్‌కి లింక్ చేసిన తర్వాత వినియోగదారులు తమ ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా ఐప్యాడ్‌లో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. టాబ్లెట్లను వినియోగించే యూజర్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

WhatsApp for iPad is now available for some users, here’s how you can use it

వాట్సాప్ కొత్త మోడ్ iPadలో పంపిన లేదా స్వీకరించిన అన్ని మెసేజ్‌లు iOS లేదా Android డివైజ్ అనే దానితో సంబంధం లేకుండా ఫోన్‌తో సింకరైజ్ అవుతుంది. వినియోగదారులు తమ ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ, ఎలాంటి ముఖ్యమైన మెసేజ్‌లను కోల్పోరు. అదనంగా, కంపానియన్ మోడ్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మెసేజ్‌లు, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ అయి ఉంటాయి.

ఐప్యాడ్ యూజర్ల కోసం వాట్సాప్, కంపానియన్ మోడ్ రెండూ ఇప్పటికీ బీటాలో ఉన్నాయి. ఈ ఫీచర్ యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే దానిపై అధికారిక ప్రకటన ఏదీ లేదు. అయితే, వాట్సాప్ బీటా iOS ప్రోగ్రామ్‌లో భాగమైతే.. మీ iPadలో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ, స్టేటస్ అప్‌డేట్‌లను చూడటంతో పాటు పోస్ట్ చేయడం, లైవ్ లొకేషన్ ఫంక్షనాలిటీ వంటి కొన్ని బగ్‌లు ఉండవచ్చని గుర్తుంచుకోండి. వాట్సాప్ ఈ సమస్యలను పరిష్కరించడానికి, భవిష్యత్ అప్‌డేట్‌లో ఇతర అప్‌గ్రేడ్ చేసేందుకు పని చేస్తోంది.

Read Also : WhatsApp AI Stickers : వాట్సాప్ ఏఐ స్టిక్కర్లు.. ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!