WhatsApp AR Features : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఏఆర్ ఫీచర్లు.. వీడియో, ఆడియో కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు..!

WhatsApp AR Features : నివేదిక ప్రకారం.. వాట్సాప్ అతి త్వరలో ఏఆర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ బీటా వెర్షన్ 2.24.13.14లో ఈ విషయాన్ని వెల్లడించింది.

WhatsApp AR Features : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఏఆర్ ఫీచర్లు.. వీడియో, ఆడియో కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు..!

WhatsApp is bringing AR features ( Image Source : Google )

Updated On : June 20, 2024 / 4:43 PM IST

WhatsApp AR Features : ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అనేక ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకున్న వాట్సాప్ ఇప్పుడు వీడియో, ఆడియో కాల్‌ల కోసం గో-టు యాప్ తీసుకొస్తోంది. కాలింగ్ ఫీచర్‌లతో ప్రియమైన వారితో కనెక్ట్ అయ్యేందుకు వినియోగదారులను ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అనుమతిస్తుంది. అంతేకాదు.. వీడియో కాల్‌లకు సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చినప్పుడల్లా స్టోర్‌లో ఏమి ఉందో తెలుసుకోవచ్చు.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో అదిరే అప్‌డేట్.. ఫొటోలు, వీడియోలకు హైక్వాలిటీ ఆప్షన్లు.. చెక్ చేసుకున్నారా?

వ్యక్తిగత లేదా వర్క్ పరంగా ప్రయోజనాల కోసం క్రమం తప్పకుండా వాట్సాప్ ఉపయోగిస్తుంటే.. ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) ఫీచర్‌లను ప్లాట్‌ఫారమ్‌లోకి తీసుకువస్తోంది. నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఏఆర్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న లేటెస్ట్ బీటా వెర్షన్ 2.24.13.14లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రాబోయే ఫీచర్ వీడియో కాల్‌ కోసం కాల్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది.

బ్యాక్‌గ్రౌండ్ ఎడిట్ ఫీచర్ :
వాట్సాప్‌లో కొత్త ఏఆర్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లతో ప్రయోగాలు చేస్తోందని సూచిస్తుంది. రాబోయే ఫ్యూచర్ అప్‌డేట్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ ఏఆర్ ఎఫెక్ట్‌లు డైనమిక్ ఫేషియల్ ఫిల్టర్‌లను యాడ్ చేయడం ద్వారా వారి వీడియో కాల్‌లను కస్టమైజ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తాయి.

ఉదాహరణకు.. టచ్-అప్ టూల్ ద్వారా తక్కువ కాంతిలోనూ వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. వాట్సాప్ కాల్‌ల సమయంలో వినియోగదారులు వారి బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసే ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేస్తోందని డబ్ల్యూబీటాఇన్ఫో పేర్కొంది.

ఈ ఫంక్షనాలిటీ ముఖ్యంగా గ్రూప్ కాన్ఫరెన్స్‌లలో ప్రయోజనకరంగా ఉంటుంది. వినియోగదారులు తమ అవసరమైన వాటిని ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆసక్తికరంగా, ఈ బ్యాక్‌గ్రౌండ్ ఎడిటింగ్ ఫీచర్ భవిష్యత్తులో డెస్క్‌టాప్ యాప్‌లలో కూడా అందుబాటులో ఉండనుంది. వినియోగదారులు భారీ స్క్రీన్‌లు, మెరుగైన ఎడిటింగ్ సామర్థ్యాల ప్రయోజనాన్ని పొందవచ్చు. వాట్సాప్ కాల్‌ సమయంలో ప్రొఫెషనల్ సెట్టింగ్‌లు లేదా వివరణాత్మక బ్యాక్‌గ్రౌండ్ ఎడ్జెస్ట్ ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

డెవలప్ స్టేజీలో వాట్సాప్ ఏఆర్ ఫీచర్ :
వాట్సాప్‌లో ఈ ఫీచర్లతో పాటు, వీడియో కాల్‌లను మరింత వినోదాత్మకంగా ఆకర్షణీయంగా మార్చుతుంది. వినియోగదారులు రియల్ టైమ్ వీడియో ఫీడ్‌కు బదులుగా అవతార్‌లను ఉపయోగించే ఆప్షన్ త్వరలో పొందుతారు. వాట్సాప్ కాల్‌ సమయంలో క్రియేటివిటీతో పాటు ఈ ఫీచర్ ప్రైవసీపరంగా యూజర్లను అనుమతిస్తుంది. కాల్ ఎఫెక్ట్‌లు, ఫిల్టర్‌లకు వాట్సాప్ ఏఆర్ ఫీచర్ ఇంకా డెవలప్ దశలో ఉంది. రాబోయే భవిష్యత్ అప్‌డేట్‌లో ఈ కొత్త ఫీచర్లు ఉండనున్నాయి.

వాట్సాప్ కాలింగ్ స్క్రీన్ అప్‌డేట్ చేసిన ఇంటర్‌ఫేస్‌ను ఆండ్రాయిడ్‌లో బీటా వెర్షన్ 2.24.12.14లో ఆవిష్కరించినట్లు గతంలో నివేదికలు వెలువడ్డాయి. ఈ కొత్త అప్‌డేట్ ఆండ్రాయిడ్ఫోన్లలో మొత్తం కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అప్‌డేట్ చేసిన ఇంటర్‌ఫేస్ పెద్ద ప్రొఫైల్ ఫొటోతో సొగసైన డిజైన్‌ను ప్రదర్శించింది. దిగువ కాలింగ్ బార్ కోసం మెరుగైన వ్యూను అందిస్తుంది. వాట్సాప్ కాల్‌ సమయంలో యూజర్లు వారి కాంటాక్టులను మరింత సులభంగా గుర్తించడంలో సాయపడుతుంది.

Read Also : OnePlus 11R Discount : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 11ఆర్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వన్‌ప్లస్ 12ఆర్ కొనాలా వద్దా?