WhatsApp Call Links Feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై వీడియో కాల్స్ లింకులు కూడా పంపుకోవచ్చు..!
WhatsApp Call Links Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ కొత్త ఫీచర్ వస్తోంది. కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఫీచర్ ప్రవేశపెడుతోంది

WhatsApp is rolling out Call Links feature, testing video calls support for 32 users
WhatsApp Call Links Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ (Whatsapp) వాట్సాప్ కొత్త ఫీచర్ వస్తోంది. కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఈ ఫీచర్ ప్రవేశపెడుతోంది. వాయిస్ కాలింగ్ (Voice Calling) కోసం కాల్ లింక్ (Call Links)ల ఫీచర్‌ను రిలీజ్ చేస్తోంది. కేవలం ఒక ట్యాప్‌లో వాట్సాప్ వాయిస్ కాల్ చేయవచ్చునని వాట్సాప్ తెలిపింది.
కాల్ లింక్‌ల ఫీచర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులు కాల్స్ ట్యాబ్‌లో ‘Call Links’ ఆప్షన్‌పై Tap చేయండి. ఆపై ఆడియో లేదా వీడియో కాల్ లింక్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సులభంగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కాల్ లింక్ కోసం వాట్సాప్ యూజర్లు తమ WhatsApp యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవాలి. ఈ వారం నుంచే ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

WhatsApp is rolling out Call Links feature, testing video calls support for 32 users
Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ కూడా 32 మంది యూజర్ల కోసం సేఫ్ ఎన్‌క్రిప్టెడ్ వీడియో కాలింగ్‌ను టెస్టింగ్ చేస్తున్నట్టు ప్రకటించారు. వాయిస్ కాల్‌ల కోసం ఇలాంటి ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది. 32 మంది సపోర్టుతో వీడియో కాలింగ్ ఫీచర్‌తో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌తో సహా ఇతర గ్రూప్ వీడియో కాలింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
WhatsApp కాల్ లింక్‌ల ఫీచర్‌ను దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తోంది. మీకు ఇప్పటికీ ఫీచర్ కనిపించకపోతే.. త్వరలో అందుబాటులోకి వస్తుంది. వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసేందుకు యూజర్లు తమ సంబంధిత యాప్ స్టోర్‌లకు వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లవచ్చు. ఐఫోన్ వినియోగదారులు యాప్ స్టోర్‌కు వెళ్లవచ్చు.

WhatsApp is rolling out Call Links feature, testing video call support for 32 users
వాట్సాప్ ఇటీవల ఆన్‌లైన్ స్టేటస్‌ను హైడ్ చేయడం సహా కొన్ని ప్రైవసీ ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ అతి త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. రాబోయే కొద్ది నెలల్లో ఆన్‌లైన్ స్టేటస్ హైడింగ్ ఫీచర్ (Online Status Hiding) అందరికీ అందుబాటులోకి రానుందని వాట్సాప్ తెలిపింది. ఈ ఫీచర్ యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్ (Online Status)ని ప్రతి ఒక్కరి నుంచి లేదా ఎంచుకున్న కాంటాక్టుల నుంచి హైడ్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఆన్‌లైన్ స్టేటస్ హైడింగ్ ఫీచర్ చాలా ఈజీగా ఉంటుంది. వినియోగదారులందరూ చేయాల్సింది ఏమిటంటే.. WhatsAppని ఓపెన్ చేయండి. Settings > Account > Privacy> స్క్రీన్ పైభాగంలో “Last seen and online” ఆప్షన్ ఎంచుకోండి> ఈ ఫీచర్ యాక్సెస్ చేయడానికి దానిపై Tap చేయండి.. అంతే.. మీ ఆన్ లైన్ స్టేటస్ హైడ్ అయిపోతుంది.