WhatsApp Transfer Data : ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ డేటాను గూగుల్ డ్రైవ్ లేకుండా ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా?
WhatsApp Transfer Data : ప్రముఖ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఇంటర్‌ఫేస్‌ను కొత్తగా మార్చేసింది. 2023లో కొన్ని అత్యవసరమైన ఫీచర్‌లను వాట్సాప్ తీసుకురావాలని యోచిస్తోంది.

WhatsApp may soon allow users to transfer data from Android to Android without Google Drive
WhatsApp Transfer Data : ప్రముఖ వాట్సాప్ (Whatsapp) ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్‌లో ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఇంటర్‌ఫేస్‌ను కొత్తగా మార్చేసింది. 2023లో కొన్ని అత్యవసరమైన ఫీచర్‌లను వాట్సాప్ తీసుకురావాలని యోచిస్తోంది. వాట్సాప్ అందించబోయే కొత్త ఫీచర్‌లలో ఒకటి కొత్త చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.
గత ఏడాదిలో మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్లు తమ చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి iOSకి మార్చడానికి కొత్త ఫీచర్‌ను రూపొందించింది. కానీ, ఇప్పుడు WABetaInfo ప్రకారం.. WhatsApp యూజర్లు చాట్ హిస్టరీని కొత్త Android డివైజ్‌కు తరలించడానికి అనుమతించే కొత్త చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ డెవలప్‌లో ఉందని యాప్ ఫీచర్ అప్‌డేట్‌లలో లాంచ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఫీచర్‌తో చాట్ ట్రాన్స్‌ఫర్ ఎలా? :
ప్రస్తుతం, WhatsApp Google Driveలో చాట్ హిస్టరీ బ్యాకప్‌లను సేవ్ చేసేందుకు Android యూజర్లకు అనుమతిస్తుంది. వాట్సాప్‌లో కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు మారినప్పుడల్లా.. యూజర్లు తమ Google అకౌంట్లో లాగిన్ చేసి, ఆపై వారి WhatsApp అన్ని చాట్ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు, ఇతర డేటాను పొందవచ్చు. చాట్ బ్యాకప్‌ను తిరిగి పొందవచ్చు.

WhatsApp may soon allow users to transfer data from Android to Android without Google Drive
ప్రతి ఒక్కరికీ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, WhatsApp యూజర్లు WhatsApp Settings> Chats> Chat Transfer ఫీచర్ సాయంతో Android డివైజ్ ద్వారా యాప్ డేటాను ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి మరొక స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఈ విధంగా వాట్సాప్ యూజర్లు Google Disk బ్యాకప్‌లో డిఫెండింగ్ లేకుండా మైగ్రేటింగ్ ఆప్షన్ పొందుతారు. ఇంతలో, WhatsApp మెసేజ్ ఫీచర్‌తో సహా కొన్ని ఇతర ఫీచర్లపై కూడా పని చేస్తోంది.
నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఫీచర్‌తో యూజర్లు అదృశ్యమవుతున్న మెసేజ్‌లను తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు. తద్వారా చాట్‌లోని ప్రతి ఒక్కరూ చూడగలరు. అయినప్పటికీ, WhatsApp ఇప్పటికీ యూజర్లను చాట్ విండో నుంచి శాశ్వతంగా అదృశ్యం అయ్యేలా ఎప్పుడైనా మెసేజ్ ‘Un-Keep’ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.. అదృశ్యమయ్యే మెసేజ్ ఆప్షన్ ఆన్ చేయాలి.
వినియోగదారులు చాట్ విండో నుంచి అదృశ్యం కాకుండా నిరోధించడానికి కొన్ని మెసేజ్‌లను ఎంచుకుని, తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు. ఇతర చాట్‌ల గడువు ముగిసిన తర్వాత కూడా యూజర్లు సేవ్ చేసిన మెసేజ్‌లపై బుక్‌మార్క్ బబుల్‌ని చూడవచ్చు. వాట్సాప్ చాట్ చేసే వారందరినీ ఎప్పుడైనా ఉంచిన మెసేజ్‌లను డిలీట్ చేయడానికి WhatsApp అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ స్టేజీలో ఉందని, భవిష్యత్ అప్‌డేట్‌లలో రావొచ్చునని నివేదిక చెబుతోంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..