WhatsApp Multiple Accounts : ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడుకోవచ్చు.. ఎప్పటినుంచో తెలుసా?
WhatsApp Multiple Accounts : ఇప్పటివరకూ ఒక వాట్సాప్ అకౌంట్ సింగిల్ డివైజ్‌లో మాత్రమే యాక్సస్ చేసుకునే వీలుంది. ఇకపై సింగిల్ డివైజ్‌లో మల్టీపుల్ వాట్సాప్ అకౌంట్లను లాగిన్ కావొచ్చు.

WhatsApp may soon let you add multiple accounts to one device
WhatsApp Multiple Accounts : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) తమ యూజర్లను ఆకట్టుకునేందుకు అనేక సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఆపిల్ ఐఫోన్ (iPhone), ఆండ్రాయిడ్ (Android) యూజర్ల కోసం వాట్సాప్ ఇప్పటికీ మల్టీ డివైజ్ సపోర్టును అందిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్ మరో ఆసక్తి కరమైన ఫీచర్‌పై పని చేస్తోంది.
ఒకే డివైజ్‌లో మల్టీ అకౌంట్లను యాక్సస్ చేసుకునేందుకు యూజర్లను అనుమతిస్తుంది. ఈ ఫంక్షన్ (WABetaInfo) ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ (Android) బీటా వెర్షన్ 2.23.13.5తో డెవలప్‌మెంట్ స్టేజీలో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి, ఈ మల్టీ అకౌంట్ల ఫంక్షన్ వాట్సాప్ వ్యాపార యూజర్లపై దృష్టి పెడుతోంది.
Read Also : TVS iQube EV Scooter : ఓలా, బజాజ్, ఏథర్‌కు పోటీగా.. టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్.. ధర ఎంతంటే..!
వాట్సాప్ మెసెంజర్ కూడా ఫ్యూచర్ అప్‌డేట్‌లో ఈ ఫంక్షన్‌ను అందిస్తుందని నివేదిక పేర్కొంది. త్వరలో మరిన్ని ఫీచర్లను యాడ్ చేయనుంది. ఒకే డివైజ్‌లో అందుబాటులో ఉన్న మల్టీ అకౌంట్లను వాట్సాప్ యాడ్ చేయనుంది. దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్‌లో (WABetaInfo) వివరణ ఇచ్చింది. మొదటిసారి అదనపు అకౌంట్ సెటప్ చేసినప్పుడు.. మీ అకౌంట్ నుంచి లాగ్ అవుట్ చేయొచ్చు. మీ డివైజ్‌లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మీకు కావాల్సిన వాట్సాప్ అకౌంట్‌కు ఈజీగా మారవచ్చు.

WhatsApp Multiple Accounts : WhatsApp may soon let you add multiple accounts to one device
వాట్సాప్ విభిన్న అకౌంట్లలో వ్యక్తిగత చాటింగ్స్, వర్క్ సంబంధిత చాట్‌లు, ఇతర టాస్క్‌లను నిర్వహించాల్సిన వారికి ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. వాట్సాప్ యూజర్లకు రెండో ఫోన్ యాక్సస్ అవసరం ఉండదు. వివిధ అకౌంట్ల మధ్య మారవచ్చు. ఒక ఫోన్ నంబర్ మరొకదానికి అంతరాయం కలిగించదు.
ఈ ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలో ఉందని (WABetaInfo) పేర్కొంది. ఇంతకీ.. ఎన్ని ఫోన్ నంబర్‌లను యాడ్ చేయొచ్చు? ఎన్ని అకౌంట్లలో లాగిన్ కావొచ్చు? ఐఓఎస్ (iOS), (Android) యూజర్లకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో కంపెనీ రివీల్ చేయలేదు.
Read Also : Maruti Suzuki Baleno : మేలో అత్యధికంగా అమ్ముడైన మారుతి సుజుకి బాలెనో.. టాప్ SUVగా హ్యుందాయ్ క్రెటా