WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వందకు పైగా ఫొటోలు, వీడియోలు సింగిల్ క్లిక్‌తో పంపుకోవచ్చు తెలుసా?
WhatsApp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలను పంపుకునే వీలుంది. వాట్సాప్‌లో ఎక్కువ సంఖ్యలో ఫొటోలు, వీడియోలను ఒకేసారి పంపాలంటే సాధ్యపడదు.

WhatsApp now allows users to send 100 photos and videos in single go
WhatsApp New Feature: ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్ వచ్చేస్తోంది. ఇప్పటివరకూ వాట్సాప్‌లో మెసేజ్‌లతో పాటు ఫొటోలు, వీడియోలను పంపుకునే వీలుంది. వాట్సాప్‌లో ఎక్కువ సంఖ్యలో ఫొటోలు, వీడియోలను ఒకేసారి పంపాలంటే సాధ్యపడదు. 30 కన్నా ఎక్కువ ఫొటోలు, వీడియోలను పంపలేరు. అయితే, మెసేజింగ్ యాప్ ఇప్పుడు 100 కన్నా ఎక్కువ ఫొటోలు, వీడియోలను పంపేందుకు వాట్సాప్ యూజర్లకు అనుమతిస్తుంది.
గతంలో ఒకేసారి గరిష్టంగా 30 ఫొటోలు, వీడియోలు పంపే అవకాశం ఉండేది. కానీ, వాట్సాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.22.24.73 WhatsApp లిమిట్100కి పొడిగించింది. వాట్సాప్ వినియోగదారులు ఒకేసారి ఎక్కువ మీడియా ఫైళ్లను షేర్ చేసుకునే అవకాశం అందిస్తోంది. 2 బిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లతో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ ఒకటిగా నిలిచిపోయింది.

WhatsApp New Feature : WhatsApp now allows users to send 100 photos
వాట్సాప్‌లో మీడియా లిమిట్‌తో పాటు WhatsApp కొత్త ఫీచర్‌ను కూడా యాడ్ చేసింది. యాప్‌లో డాక్యుమెంట్లను క్యాప్షన్‌లను యాడ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ ఫొటోలు, వీడియోల క్యాప్షన్లు ఆప్షన్ అందిస్తోంది. కానీ, యూజర్ పర్సనల్, గ్రూపు చాట్‌లలో షేర్ చేసిన డాక్యుమెంట్లకు క్యాప్షన్లు యాడ్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్‌లు, డిస్క్రిప్షన్‌ల కోసం క్యారెక్టర్ లిమిట్ కూడా విస్తరించింది. వాట్సాప్ యూజర్ల కోసం కొత్త లిమిట్ వెల్లడించింది. వాట్సాప్ గ్రూప్ సబ్జెక్ట్‌ల కోసం మునుపటి లిమిట్ 25 అక్షరాలు ఉండగా.. ఇకపై 512 అక్షరాల కన్నా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఆండ్రాయిడ్ వాట్సాప్‌లో మాత్రమే కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్ త్వరలో iOS యూజర్ల కోసం కూడా అందుబాటులోకి తీసుకురానున్నాయి. WhatsApp బిజినెస్ కోసం WhatsAppలో ఎంపిక చేసిన బీటా టెస్టర్ల గ్రూపులో ‘Kept Messages’ అనే ఫీచర్‌ని టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు అదృశ్యమయ్యే మెసేజ్‌లను ఉంచడానికి అనుమతిస్తుంది. WhatsApp iOSలో ట్రాన్స్‌క్రిప్ట్‌లను కూడా టెస్టింగ్ చేస్తోంది. గత ఏడాదిలో WhatsApp ఫైల్ లిమిట్ మునుపటి 100MB పరిమితి నుంచి 2GBకి పెంచింది. అయితే, ఈ ఫీచర్ iOS యూజర్ల కోసం వాట్సాప్ ఇంకా ప్రవేశపెట్టలేదు.

WhatsApp New Feature : WhatsApp now allows users to send 100 photos
ఈ కొత్త ఫీచర్లతో యూజర్లు తమ వాట్సాప్‌లో మీడియా, డాక్యుమెంట్‌లను షేర్ చేసేందుకు సులభతరం చేస్తాయని భావిస్తున్నారు. వాట్సాప్ ఫొటోలు, వీడియోలపై పెరిగిన లిమిట్‌తో యూజర్లు ఇప్పుడు ఒకే మెసేజ్‌లో ఎక్కువ కంటెంట్‌ను షేర్ చేయవచ్చు, తద్వారా మల్టీ మెసేజ్ అవసరాన్ని తగ్గిస్తుంది. డాక్యుమెంట్‌లపై క్యాప్షన్‌ల కోసం కొత్త ఫీచర్ యూజర్‌లు షేర్ చేసే ఫైల్‌లకు క్యాప్షన్ సులభతరం చేస్తుంది. చివరగా, గ్రూప్ సబ్జెక్ట్‌లు, టెక్స్ట్ లిమిట్ పెంచడం వల్ల వినియోగదారులు తమ గ్రూప్‌లను మరింత మెరుగ్గా వివరించడంలో సాయపడుతుంది. వాట్సాప్ యూజర్ల కోసం ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది.