WhatsApp: వాట్సప్ గ్రూప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది.. ఏంటో తెలుసా?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ గ్రూపులో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.

Whatsapp Now Testing Communities Feature To Take On Signal, Telegram
WhatsApp Communities feature : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ (Meta) సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్ గ్రూపులో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. కమ్యూనిటీ ఫీచర్ (Community feature). సిగ్నల్, టెలిగ్రామ్ కు పోటీగా వాట్సాప్ ఈ కమ్యూనిటీ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ కమ్యూనిటీ ఫీచర్ పై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోంది. గ్రూప్ చాట్‌లను క్రమబద్ధీకరించేందుకు వాట్సాప్ ఈ కొత్త కమ్యూనిటీ ఫీచర్ తీసుకురానుంది. ముందుగా XDA డెవలపర్ ఈ ఫీచర్ గుర్తించగా.. వాట్సాప్ బీటా ఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు కమ్యూనిటీలో ప్రత్యేక ఫీచర్లను యాడ్ చేయనుంది. తద్వారా వాట్సాప్ గ్రూప్‌లపై గ్రూప్ అడ్మిన్లకు మరింత కంట్రోల్ ఇవ్వనుంది. చాటింగ్ యాప్ డిస్‌కార్డ్ (Discord) ప్లాట్‌ఫాం కమ్యూనిటీ ఫీచర్ మాదిరిగానే ఈ కొత్త వాట్సాప్ కమ్యూనిటీ ఫీచర్ వర్క్ అవుతుంది. వాట్సాప్ కమ్యూనిటీలోని సభ్యులు వేర్వేరు గ్రూప్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయా గ్రూప్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.
కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉండే యూజర్లు తమ కమ్యూనిటీలోని అన్ని గ్రూప్లలోకి కూడా మెసేజ్‌లు పంపుకోవచ్చు. సాధారణ వాట్సాప్ గ్రూప్ మాదిరిగానే కమ్యూనిటీ అడ్మిన్లు ఇతరులను Invite Link, క్యూఆర్ (QR Code) కోడ్ ద్వారా మాన్యువల్‌గా గ్రూప్లలోకి యాడ్ చేయొచ్చు. ఈ మాదిరిగా గ్రూపులో చేరిన సభ్యులకు కొన్ని ఫీచర్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
వాట్సాప్ కమ్యూనిటీలోకి కొత్తగా యాడ్ అయిన వ్యక్తి ఇతర సభ్యులతో చాట్ చేయవచ్చా? లేదా? అనేది కమ్యూనిటీ అడ్మిన్ డిసిషన్. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. ఈ కమ్యూనిటీ ఐకాన్ నాలుగు మూలలు చతురస్రాకారం ఉండి నాలుగు వైపులా రౌండ్ ఎడ్జ్ కలిగి ఉంటుంది. కమ్యూనిటీలోని గ్రూప్ అడ్మిన్ అయిన యూజర్ ఎవరైనా.. ఇతర గ్రూప్‌లకు వేర్వేరు చాట్ ఐకాన్లు క్రియేట్ చేసుకునేందుకు అనుమతినిస్తుంది. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా డేటాను ఎక్కువ మంది వాట్సాప్ యూజర్లకు పంపుకోవచ్చు. ఎక్కువ మందితో సమాచారం షేర్ చేయవచ్చునని వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
Read Also : Whatsapp: ఫెంటాస్టిక్ ఫీచర్.. వాట్సప్‌లో మెసేజ్ ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు