WhatsApp Privacy : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ఫోన్ నెంబర్‌తో పనిలేదు.. మీ యూజర్‌నేమ్‌తోనే అన్నీ.. ఇదో గేమ్ ఛేంజర్..!

WhatsApp Privacy : వాట్సాప్ ప్రైవసీ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే చాట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?

WhatsApp Privacy

WhatsApp Privacy : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ప్రైవసీ కోసం సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. చాలా కాలంగా (WhatsApp Privacy )ఎదురుచూస్తున్న ఈ కొత్త ఫీచర్‌ను అతి త్వరలో రిలీజ్ చేయనుంది. ఈ ప్రైవసీ ఫీచర్ ద్వారా ఫోన్ నెంబర్ షేర్ చేయకుండానే ఈజీగా చాట్ చేసుకోవచ్చు.

ఇకపై వాట్సాప్ యూజర్లు తమ ప్రత్యేకమైన యూజర్ నేమ్స్ సెట్ చేసుకోవచ్చు. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్‌లను ఎవరికి తెలియకుండా హైడ్ చేయొచ్చు.

Read Also : Vivo T3 Ultra 5G : ఆఫర్ అదుర్స్.. అమెజాన్‌లో అతి చౌకైన ధరకే వివో T3 అల్ట్రా ఫోన్.. సూపర్ డీల్..!

ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్‌లో టెస్టింగ్ చేస్తోంది. రాబోయే ఈ కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ (WABetaInfo)గుర్తించింది . నివేదిక ప్రకారం.. టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే యూజర్‌నేమ్‌లను క్రియేట్ చేసేందుకు అనుమతించనుంది.

గ్రూప్ చాట్‌లలో కూడా మీకు తెలియని వ్యక్తులతో చాట్ చేయొచ్చు. వారికి మీ యూజర్ నేమ్ తప్పా మొబైల్ నెంబర్ తెలిసే అవకాశం ఉండదు. తద్వారా మీ ప్రైవసీ కాంటాక్టుపై మరింత కంట్రోల్ పొందవచ్చు. యూజర్ నేమ్స్ ఫీచర్ ఒక గేమ్ ఛేంజర్ కానుంది.

ప్రైవసీ చాటింగ్ చేయొచ్చు :
ఇప్పటివరకూ వాట్సాప్ యూజర్లు తమ మొబైల్ నంబర్‌లతో ఇతరులతో కనెక్ట్ అవ్వాల్సి ఉండేది. ప్రైవసీపరంగా యూజర్లకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా గ్రూప్ చాట్స్ లేదా బిజినెస్ సంబంధిత చాటింగ్ సమయంలో వ్యక్తిగత ఫోన్ నెంబర్లను షేర్ చేయాల్సి వచ్చేది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు వాట్సాప్ సరికొత్తగా యూజర్‌నేమ్ ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్‌తో తమ ఫోన్ నంబర్ తెలియకుండానే ఇతరులతో సులభంగా చాట్ చేయొచ్చు.

ఇదేలా పనిచేస్తుందంటే? :
ఒకసారి ఈ ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు కనీసం ఒక అక్షరం లేదా నిర్దిష్ట ఫార్మాటింగ్ రూల్స్ పేరును ఎంచుకోగలరు. యూజర్ నేమ్స్ ‘www’తో ప్రారంభం కాకూడదు. స్మాల్ లెటర్స్, నంబర్లు, అండర్‌స్కోర్‌లు లేదా డాట్స్ మాత్రమే ఉండాలి.

యూజర్ నేమ్ క్రియేట్ చేశాక యూజర్లు కాన్ఫెట్టి యానిమేషన్‌ను చూడొచ్చు. వాట్సాప్ యూజర్ తమ యూజర్‌నేమ్‌ను మార్చుకుంటే.. ప్రొఫైల్ పిక్చర్ లేదా నంబర్ మార్పు మాదిరిగా చాట్‌లలో సిస్టమ్ నోటిఫికేషన్ మెసేజ్ డిస్‌ప్లే అవుతుంది.

అయితే, ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ వినియోగంపై లిమిట్ ఉండనుంది. ప్రస్తుతానికి, యూజర్‌నేమ్‌లు ప్రధానంగా యూజర్లు తమ ఫోన్ నంబర్‌లను ఇప్పటికే సేవ్ చేసుకోని వ్యక్తులతో చాట్ చేసేందుకు సాయపడతాయి.

వాట్సాప్ తమ ఫోన్ నంబర్‌లను ఇప్పటికే ఉన్న కాంటాక్ట్‌ల నుంచి పూర్తిగా హైడ్ చేసేందుకు అనుమతిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు.

Read Also : Motorola Edge 50 Fusion : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌పై ఖతర్నాక్ డిస్కౌంట్.. బ్యాంకు ఆఫర్లు కూడా..!

అదనపు ఫీచర్లు :
యూజర్ నేమ్‌లతో పాటు వాట్సాప్ యూజర్లు కోరుకున్న యూజర్ నేమ్ ఎంచుకునేలా టూల్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. ఫ్యూచర్ అప్‌డేట్‌లో మొబైల్ యాప్, వాట్సాప్ వెబ్ రెండింటిలోనూ ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం ఉంది.

ఈ యూజర్ నేమ్ ఫీచర్ ఇంకా యూజర్లకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే బీటా వెర్షన్లలో అందుబాటులో ఉండగా కంపెనీ డెవలప్ లాస్ట్ స్టేజీలో ఉందని తెలుస్తోంది.