WhatsApp Report : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో స్టేటస్ అప్‌డేట్స్‌పై కూడా రిపోర్టు చేయొచ్చు!
WhatsApp Report : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా మెసేజింగ్ యాప్ (Whatsapp Web) డెస్క్‌టాప్ బీటాలో స్టేటస్ అప్‌డేట్ (Status Updates)లను రిపోర్టు చేసే అవకాశాన్ని అనుమతించనుంది.

WhatsApp Report _ WhatsApp may soon allow users to report status updates
WhatsApp Report : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా మెసేజింగ్ యాప్ (Whatsapp Web) డెస్క్‌టాప్ బీటాలో స్టేటస్ అప్‌డేట్ (Status Updates)లను రిపోర్టు చేసే అవకాశాన్ని అనుమతించనుంది. ఇప్పుడు వాట్సాప్ ఆ కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. వాట్సాప్ స్టేటస్ సెక్షన్‌లో కొత్త మెనూని క్రియేట్ చేయనుంది. తద్వారా రిపోర్టింగ్ ప్రాసెస్‌ను సులభతరం చేయనుంది. మెసేజింగ్ యాప్ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు యూజర్లు, మెసేజ్‌లు, కాంటాక్టులను రిపోర్టు చేయడానికి అనుమతించే ఆప్షన్ WhatsApp కలిగి ఉంది. Wabetainfo ప్రకారం.. WhatsApp ఇప్పుడు స్టేటస్ అప్‌డేట్స్ రిపోర్టు చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
మీ కాంటాక్టులో ఉన్న యూజర్లు అశ్లీల వీడియోను స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేయడం లేదా యూజర్ల మనోభావాలను దెబ్బతీసే లేదా హింసను ప్రేరేపించే ఏదైనా వీడియోను వాట్సాప్‌లో రిపోర్టు చేయవచ్చు. మెసేజింగ్ యాప్ ప్రస్తుతం డెస్క్‌టాప్ వెర్షన్‌లో ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది. ఈ స్టేటస్ సెక్షన్‌లోని కొత్త మెనూలోనే స్టేటస్ అప్‌డేట్‌ను రిపోర్ట్ చేయడం సాధ్యమవుతుంది.
మీరు వారి సర్వీసు నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా అనుమానాస్పద స్టేటస్ అప్‌డేట్స్ చూసినట్లయితే.. మీరు చివరకు దానిని మోడరేషన్ టీంకు రిపోర్టు చేయవచ్చు. వాట్సాప్ మెసేజ్‌లను రిపోర్టు చేసే విధంగా స్టేటస్ అప్‌డేట్ మోడరేషన్ కారణాలపై వాట్సాప్‌కు ఫార్వార్డ్ అవుతుంది. తద్వారా వాట్సాప్ ఉల్లంఘన జరిగితే చూడవచ్చునని Wabetainfo పేర్కొంది.

WhatsApp Report : WhatsApp may soon allow users to report status updates
స్టేటస్ అప్‌డేట్‌లను రిపోర్టు చేసే సామర్థ్యం డెవలప్‌మెంట్ స్టేజ్ ఫీచర్‌గా రానుందని Wabetanifo నివేదించింది. WhatsApp డెస్క్‌టాప్ బీటా భవిష్యత్తు అప్‌డేట్‌లో ఈ ఫీచర్ లాంచ్ కానుంది. వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్‌లో DND ఫీచర్‌ను లాంచ్ చేయాలని కూడా యోచిస్తోంది.
WhatsApp రాబోయే ఫీచర్ ఇప్పుడు Windowsలో WhatsApp కాల్‌ల కోసం నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయడంలో సాయం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ స్టోర్‌లోని అధికారిక బీటా ఛానెల్ ద్వారా కొంతమంది బీటా టెస్టర్‌లకు కాల్స్ ఫీచర్ కోసం నోటిఫికేషన్‌లను నిలిపివేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. విండోస్ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసిన యూజర్లు యాప్ సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను డిసేబుల్ చేసే అవకాశాన్ని పొందే అవకాశం ఉందని వాట్సాప్ నివేదించింది.
ఇన్‌కమింగ్ వాట్సాప్ కాల్‌లను స్వీకరించకూడదనుకుంటే సైలంట్ ఉంచడంలో కొత్త ఫీచర్ అందించనుంది. DND ఫీచర్‌తో పాటు, వాట్సాప్ యూజర్ల కోసం ‘Delete For Me’ మెసేజ్ క్యాన్సిల్ చేయడానికి కొత్త ‘Accidental delete’ ఫీచర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్, iOS యూజర్లందరికి ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. 5 సెకన్ల వ్యవధిలో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందేందుకు యూజర్లను అనుమతిస్తుంది. మీరు మెసేజ్ పొరపాటును డిలీట్ చేస్తే.. మీరు Undo ‘Delete For Me’ మెసేజ్ ఉపయోగించవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..