WhatsApp Spotted Working on AI-Powered Image Editor, Ask Meta AI Feature
WhatsApp AI Image Editor : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఏఐ ఫీచర్ వస్తోంది. ఫీచర్ ట్రాకర్ ప్రకారం.. వాట్సాప్ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా ఆధారితమైన ఎడిటింగ్ టూల్‌ని అందించనుంది. ఈ కొత్త ఏఐ ఫీచర్ సాయంతో యూజర్లు తమ ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.
Read Also : WhatsApp Chat Pin : వాట్సాప్ చాట్‌లో ఇకపై 3 మెసేజ్‌లను పిన్ చేయొచ్చు తెలుసా? ఇలా చేస్తే చాలు..!
ప్రస్తుతం వాట్సాప్ కొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్‌పై పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ యూజర్లందరికి అందుబాటులోకి రానుంది. త్వరలో వినియోగదారులు తమ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఇమేజ్‌ను రీస్టైల్ కూడా చేయగలరు. మరోవైపు.. కంపెనీ సెర్చ్ బార్ నుంచి నేరుగా కంపెనీ ‘మెటా ఏఐ సర్వీసుకు ప్రశ్నలు అడిగేలా యూజర్లను అనుమతించే ఫీచర్‌పై పనిచేస్తోంది.
వాట్సాప్ ట్రాకర్ ప్రకారం.. ఆండ్రాయిడ్ 2.24.7.13 లేటెస్ట్ వాట్సాప్ బీటా అప్‌డేట్ ఏఐ పవర్డ్ ఇమేజ్ ఎడిటర్ కోడ్‌ను కలిగి ఉంది. ప్రస్తుతానికి ఈ ఏఐ ఫీచర్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో ఉంది. ప్రస్తుతం యాప్ బీటా వెర్షన్ యూజర్లు కూడా టెస్టింగ్ చేయలేరు. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఫొటోలను పంపుతున్నప్పుడు ఇంటర్‌ఫేస్‌లో ఫీచర్ ప్రారంభ వెర్షన్ కనిపిస్తుంది. హెచ్‌డీ ఐకాన్ ఎడమవైపు ఎగువన గ్రీన్ ఐకాన్ కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేయడం ద్వారా బ్యాక్‌డ్రాప్, రీస్టైల్, ఎక్స్‌పాండ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
ఈ కొత్త ఏఐ ఫీచర్ ఇంకా ఏమి చేయగలదో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మెటా ఏఐకి ప్రశ్నలను అడగడానికి యాప్ టాప్ కార్నర్‌లో సెర్చ్ బాక్స్ సామర్థ్యాన్ని ఫీచర్ ట్రాకర్ గుర్తించింది. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీతో పోటీగా రూపొందించిన మెటా ప్రొడక్టులకు కంపెనీ జనరేటివ్ ఏఐ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. ఈ రెండు ఫీచర్లు ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. మీరు యాప్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసిన తర్వాత ఈ ఫీచర్లను టెస్టింగ్ చేయలేరని గమనించాలి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు మొబైల్ ప్లాట్‌ఫారమ్‌లలో కొత్త ఏఐ ఫీచర్ అందుబాటులోకి రానుంది.