WhatsApp Chat Pin : వాట్సాప్ చాట్‌లో ఇకపై 3 మెసేజ్‌లను పిన్ చేయొచ్చు తెలుసా? ఇలా చేస్తే చాలు..!

WhatsApp Chat Pin : వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ వచ్చేసింది. యూజర్లు తమ చాట్‌లో మూడు మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. గతంలో కేవలం ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేసే వీలుండేది.

WhatsApp Chat Pin : వాట్సాప్ చాట్‌లో ఇకపై 3 మెసేజ్‌లను పిన్ చేయొచ్చు తెలుసా? ఇలా చేస్తే చాలు..!

WhatsApp rolls out new feature for everyone,

WhatsApp Chat Pin : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లందరి కోసం సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లను తమ చాట్‌లో మూడు మెసేజ్‌లను ఈజీగా పిన్ చేసేందుకు అనుమతిస్తుంది. గతంలో కేవలం ఒక మెసేజ్ మాత్రమే పిన్ చేయడానికి పరిమితం చేసింది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా మరింత మంది యూజర్లను ఆకర్షించనుంది.

Read Also : WhatsApp Voice to Text Feature : వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ మెసేజ్ టెక్స్ట్‌లోకి మార్చుకోవచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ఇద్దరూ తమ వాట్సాప్ ఛానెల్‌ల ద్వారా ఈ ఫీచర్‌ను వెల్లడించారు. మెసేజ్‌లను పిన్ చేసే సామర్థ్యం మొదట్లో ఒకరితో ఒకరు, గ్రూప్ చాట్‌లకు గత ఏడాది డిసెంబర్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫంక్షనాలిటీ టెక్స్ట్, ఇమేజ్‌లు, పోల్‌లతో సహా అన్ని మెసేజ్ టైపులకు విస్తరించింది. మీ గ్రూపులో ప్లాన్ చేసిన విహారయాత్ర వంటి ముఖ్యమైన సమాచారాన్ని త్వరగా యాక్సెస్ చేసేందుకు మెసేజ్ పిన్ చేసుకోవచ్చు.

లాంగ్ ప్రెస్ చేసి ట్యాప్ చేస్తే చాలు :
మెసేజ్ పిన్ చేయడానికి వినియోగదారులు చాట్‌పై లాంగ్ ప్రెస్ చేసి ‘పిన్’ ఆప్షన్ ఎంచుకోవాలి. అదనంగా, వినియోగదారులు చాట్‌లో మెసేజ్ పిన్ చేసే వ్యవధిని పేర్కొనవచ్చు. అంటే.. 24 గంటల నుంచి 30 రోజుల వరకు పిన్ టైమ్ సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు పిన్నింగ్ చేసే ఆప్షన్ లేనందున ఎక్కువ వ్యవధిలో పిన్ చేసిన మెసేజ్‌లు 30 రోజుల తర్వాత మళ్లీ పిన్ చేయాల్సి ఉంటుందని గమనించడం ముఖ్యం. దీనికి ప్రత్యామ్నాయంగా, యూజర్లు కాంటాక్టు ఇన్పర్మేషన్ మెను ద్వారా మెసేజ్ యాక్సెస్ చేయడానికి ‘స్టార్’ చేయవచ్చు. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ యూజర్లందరికి అందుబాటులో ఉంది.

బీటా వెర్షన్‌లో లాక్ ఫీచర్ :
అంతేకాకుండా, వాట్సాప్ ఇటీవలే మెసేజింగ్ యాప్ కొత్త బీటా వెర్షన్‌ను రిలీజ్ చేసింది. అందులో యాప్ లాక్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్ బయోమెట్రిక్ రికగ్నైజేషన్ కన్నా ఎక్కువ అథెంటికేషన్ ఆప్షన్లను అందిస్తుంది. వాట్సాప్ బీటా ప్రోగ్రామ్‌లో ఉన్న యూజర్లు ఈ ఫీచర్‌ను ట్రై చేయొచ్చు. వినియోగదారులు తమ డివైజ్ పాస్‌కోడ్‌తో సహా ఇతర ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లను ఉపయోగించవచ్చు. గతంలో, యాప్ లాక్ ఫీచర్ కేవలం ఫింగర్ ఫ్రింట్ లేదా ఫేస్ ఐడెంటిటీ వంటి బయోమెట్రిక్ అథెంటికేషన్‌పై ఆధారపడి పనిచేసేది.

కానీ, ఈ కొత్త యాప్ లాక్ ఫీచర్‌తో పాటు కొంతమందికి ఆండ్రాయిడ్ 2.24.6.16 వెర్షన్‌లో మరో కొత్త ఫీచర్ కూడా కనిపిస్తుంది. చాట్ కనర్వేషన్ లిస్టు ఎగువన కనిపించే చాట్ ఫిల్టర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫిల్టర్‌లు నిర్దిష్ట రకాల చాట్‌లను యూజర్ల చాట్ వ్యూను స్ట్రీమ్‌లైన్ చేసేందుకు ఎనేబుల్ చేస్తాయి. రీడ్ చేయని కనర్వేషన్లను డిస్‌ప్లే చేయడానికి గ్రూపు చాట్‌ల జాబితాను త్వరగా యాక్సెస్ చేయడానికి వాట్సాప్ ప్రత్యేక ఫిల్టర్‌లను చేర్చింది.

Read Also : WhatsApp Link Previews : వాట్సాప్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. చాట్‌లో లింక్ ప్రివ్యూలు కావాలా? వద్దా? యూజర్లదే నిర్ణయం!