WhatsApp QR Codes : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ వస్తోంది.. ఇకపై, క్యూఆర్ కోడ్స్‌తో ఛానల్స్‌లో జాయిన్ అవ్వొచ్చు!
WhatsApp QR Codes : రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ ఛానెల్ క్యూఆర్ కోడ్‌లను ఇతర యాప్‌లకు కూడా ఎక్స్‌పోర్టు చేయవచ్చు.

WhatsApp QR Codes
WhatsApp QR Codes : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ రాబోతుంది. వాట్సాప్ ఛానెల్స్ గత ఏడాదిలో అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్ ఛానెల్‌ల కోసం లేటెస్ట్ ఫీచర్ ఇప్పుడు బీటాలో ఉంది. యాప్‌లోని క్యూఆర్ కోడ్ రెస్పాండ్ (QR) కోడ్‌ని ఉపయోగించి ఛానెల్ త్వరగా షేరింగ్, వ్యూ కోసం యూజర్లను అనుమతిస్తుంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ బీటా ఇటీవలి వెర్షన్‌లలో టెస్టింగ్ చేసేందుకు ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది.
రాబోయే రోజుల్లో వినియోగదారులందరికీ ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ ఛానెల్ క్యూఆర్ కోడ్‌లను ఇతర యాప్‌లకు కూడా ఎక్స్‌పోర్టు చేయవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌లలో ఫీచర్ ట్రాకర్ ద్వారా కొత్త క్యూఆర్ కోడ్ షేరింగ్ ఫంక్షనాలిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 2.24.25.7 కోసం వాట్సాప్ బీటా లేదా ఐఓఎస్ 24.24.10.76 వాట్సాప్ బీటాకు అప్‌డేట్ చేసిన బీటా టెస్టర్లు కొత్త ఫీచర్‌ని ప్రయత్నించవచ్చు.
ఫీచర్ ట్రాకర్ ప్రకారం.. వాట్సాప్‌లో ఫీచర్‌ని ఎనేబుల్ చేసిన యూజర్లు యాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఉండాలి. ఇప్పటికే ఉన్న వాట్సాప్ ఛానెల్‌ని నిర్వహించాలి. వాట్సాప్ ఛానల్ ఇన్ఫర్మేషన్ ప్యానెల్‌ని ఓపెన్ చేసి షేరింగ్ ఆప్షన్‌లను ఎంచుకోగలరు. క్యూఆర్ కోడ్‌ను రూపొందించే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. యాప్ క్యూఆర్ కోడ్‌ను రూపొందించిన తర్వాత యూజర్లు వాట్సాప్ లేదా ఇతర మెసేజింగ్ యాప్‌లలో మరో యూజర్‌తో షేర్ చేయగలరు. క్యూఆర్ కోడ్‌తో షేరింగ్ చేయొచ్చు. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా కూడా పంపవచ్చు లేదా ఇమెయిల్ చేసి ప్రింట్ చేస్తుంది.
కస్టమర్‌లు తమ ఛానెల్‌ని ఫాలో అయ్యేలా సులభమైన మార్గాన్ని అందిస్తుంది. స్టేబుల్ అప్‌డేట్ ఛానెల్‌లోని యూజర్లకు వాట్సాప్ క్యూఆర్ కోడ్ షేరింగ్ ఫీచర్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తుందో ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. కంపెనీ ప్రస్తుతం యాప్‌కి మొత్తం స్టిక్కర్ ప్యాక్‌లను షేర్ చేయగల ‘వెబ్‌లో సెర్చ్’ ఇమేజ్ లుక్అప్ ఫీచర్, క్రాస్-డివైస్ కాంటాక్ట్ మేనేజ్‌మెంట్ వంటి ఇతర ఫీచర్లను పరీక్షిస్తోంది. బీటా ప్రోగ్రామ్‌లో భాగంగా టెస్టింగ్ తర్వాత ఈ ఫీచర్‌లు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.
Read Also : Honor 300 Pro Series : హానర్ 300 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!