WhatsApp New Features : వాట్సాప్‌లో రాబోయే కొత్త ఫీచర్లు ఇవే.. ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే? పూర్తి వివరాలు మీకోసం..!
WhatsApp New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్ ఇంటర్‌ఫేస్, ప్లాట్‌ఫారమ్ భద్రతను మెరుగుపరచేందుకు కొత్త అప్‌డేట్‌లు, మరిన్ని ఫీచర్లపై పని చేస్తోంది.

WhatsApp to improve text editor, users to get new features soon_ All details here
WhatsApp New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. యూజర్ ఇంటర్‌ఫేస్, ప్లాట్‌ఫారమ్ భద్రతను మెరుగుపరచేందుకు కొత్త అప్‌డేట్‌లు, మరిన్ని ఫీచర్లపై పని చేస్తోంది. క్యాలెండర్ ద్వారా సెర్చ్ చేయడం, స్టేటస్‌పై వాయిస్ నోట్స్, iOS యూజర్ల కోసం పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్, మరికొన్నికొత్త ఫీచర్లను అందించనుంది. WhatsApp డ్రాయింగ్ టూల్ రీడిజైన్ టెక్స్ట్ ఎడిటర్‌పై పని చేస్తోంది. Wabetainfo ప్రకారం.. WhatsApp డ్రాయింగ్ టూల్ రీడిజైన్ చేసిన టెక్స్ట్ ఎడిటర్‌పై పని చేస్తోంది. కొత్త ఫీచర్‌లో టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మార్చడం, ఫాంట్‌ల మధ్య మారడంతో పాటు టెక్స్ట్ అలైన్‌మెంట్‌లో ఫ్లెక్సిబిలిటీ వంటి మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
Switch Between Fonts : వాట్సాప్ యూజర్లు కీబోర్డ్ పైన డిస్‌ప్లే ఫాంట్ ఆప్షన్లలో వివిధ ఫాంట్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది. ఫోటోలు, వీడియోలు, GIFలలో టెక్స్ట్ ఎడ్జెస్ట్ చేసేటప్పుడు ఈ ఫీచర్ యూజర్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది. కొత్త అప్‌డేట్ యూజర్లకు విభిన్న ఫాంట్ స్టైల్స్‌తో అందిస్తోంది.
Flexibility in text Alignment : ఈ ఫీచర్ యూజర్లకు టెక్స్ట్ అలైన్‌మెంట్ సామర్థ్యాన్ని అందిస్తుంది. యూజర్లు టెక్స్ట్ ద్వారా ఎడ్జెస్ట్ చేసే విధంగా అనుమతిస్తుంది. ఆకర్షణీయంగా ఉంటుంది.
Change text background : మూడో ఫీచర్ యూజర్లకు టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ మార్చేందుకు అనుమతిస్తుంది. టెక్స్ట్ వేరు చేయడాన్ని సులభతరం చేస్తుంది. యూజర్లు టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ కలర్లను మార్చడం ద్వారా ఏదైనా టెక్స్ట్ కూడా హైలైట్ చేయవచ్చు. కొత్త టెక్స్ట్ ఎడిటర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. WhatsApp ఫ్యూచర్ అప్‌డేట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

WhatsApp to improve text editor, users to get new features soon
వాట్సాప్ నుంచి రాబోయే కొత్త ఫీచర్లు ఇవే :
వాట్సాప్ కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తుంది. వినియోగదారులను రియల్ క్వాలిటీతో ఫొటోలను పంపేందుకు అనుమతిస్తుంది. ప్లాట్‌ఫారమ్ డ్రాయింగ్ టూల్‌కు సమీపంలో కొత్త సెట్టింగ్ ఐకాన్ యాడ్ చేయాలని యోచిస్తోంది. యూజర్లు ఫొటోను పంపే ముందు క్వాలిటీని కాన్ఫిగర్ చేసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతం, WhatsApp మీడియా క్వాలిటీని తగ్గించే ఫొటోలు, వీడియోలను కలిగి ఉంది. కొత్త అప్‌డేట్‌తో, ఒరిజినల్ HD-క్వాలిటీ ఫొటోలను షేర్ చేయడంతో పాటు సేవ్ చేసేందుకు యూజర్లకు అనుమతినిస్తుంది. వాట్సాప్ (WhatsApp) లేటెస్ట్ 23.1.75 అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. Message For Me ఫీచర్, సెర్చ్ బై డేట్ ఫీచర్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.
వాట్సాప్ అప్‌డేట్‌లో మరో రెండు కీలక ఫీచర్లు ఉన్నాయి: తేదీ వారీగా మెసేజ్ సెర్చ్ చేసే ఫీచర్, ఇతర యాప్‌ల నుంచి ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను షేర్ చేయడం, డ్రాగ్ డ్రాప్ చేయడం వంటి ఎన్నో ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయి. మొదటి ఫీచర్ తేదీని సెటప్ చేయడం ద్వారా నేరుగా ఏదైనా గత చాట్ కోసం సెర్చ్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. రెండో ఫీచర్ మూడవ యాప్ నుంచి ఏదైనా ఫోటో లేదా మీడియాను సులభంగా షేర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌లు యాప్‌లోని కంటెంట్‌ను గుర్తించి షేర్ చేసేందుకు యూజర్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..