Whatsapp iPhones : బిగ్ అలర్ట్.. ఈ ఆపిల్ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!

Whatsapp iPhones : కొన్ని పాత ఐఫోన్లలో వాట్సాప్ సపోర్టు నిలిపివేయనుంది. 15.1 కన్నా ముందు iOS వెర్షన్‌లు రన్ అయ్యే ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఐఫోన్ 5s, 6, ఐఫోన్ 6 ప్లస్ యాప్‌కు యాక్సెస్‌ చేయలేరు.

Whatsapp iPhones

Whatsapp iPhones : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఐఫోన్‌లో మే 5, 2025 నుంచి వాట్సాప్ పనిచేయదు. వాట్సాప్ కొన్ని ఐఫోన్ మోడళ్లకు వాట్సాప్ సర్వీసులను నిలిపివేస్తోంది. వచ్చే నెల నుంచి మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ iOS పాత వెర్షన్‌లలో కొన్ని ఐఫోన్లలో పనిచేయదు.

Read Also : iPhones Price Drop : వావ్.. అదిరే డీల్స్.. ఈ 3 ఐఫోన్ మోడళ్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. అతి తక్కువ ధరకే కొనేసుకోండి..!

అధికారిక ప్రకటన ప్రకారం.. వాట్సాప్ iOS 15.1 లేదా ఆ తర్వాతి వెర్షన్‌లలో రన్ అయ్యే ఐఫోన్లలో మాత్రమే సపోర్టు ఇస్తుంది. మీ ఐఫోన్ కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ లేదా సపోర్టు చేయకపోతే త్వరలో వాట్సాప్ యాక్సెస్‌ను పూర్తిగా కోల్పోతారు. ఇకపై వాట్సాప్ మెసేజ్‌లు రావు.. ఫోన్ కాల్స్ పోవు. వాట్సాప్ నోటిఫికేషన్‌లు కూడా రావు.

ఏ ఐఫోన్‌లపై ప్రభావం ఉందంటే? :
– ఐఫోన్ 5s
– ఐఫోన్ 6
– ఐఫోన్ 6 ప్లస్

ఆపిల్ ఈ పాత ఐఫోన్‌లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అందించడం ఆపివేసింది. తద్వారా భద్రతా లోపాలకు గురయ్యే అవకాశం ఉంది. సెక్యూరిటీ అప్‌‌డేట్స్ లేకుంటే వినియోగదారుల డేటా మరింత రిస్క్ ఉంటుంది. పాత స్మార్ట్‌ఫోన్‌లకు వాట్సాప్ సపోర్టు కూడా నిలిచిపోతుంది.

Read Also : Reliance Jio : పండగ చేస్కోండి.. 72 రోజుల వ్యాలిడిటీతో జియో కొత్త ప్లాన్.. ఫ్రీగా 20GB హైస్పీడ్ డేటా..!

ఐఫోన్ యూజర్లు ఏం చేయాలి? :
మీ ఐఫోన్ ఈ జాబితాలో ఉంటే లేటెస్ట్ మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇదే బెస్ట్ సొల్యుషన్. ప్రస్తుతానికి, ఐఫోన్ 8, ఐఫోన్ X ఆపై వెర్షన్‌లతో సహా ఐఫోన్‌లకు వాట్సాప్ సపోర్టు అందిస్తూనే ఉంటుంది. ఈ మోడల్స్ కూడా క్రమంగా అప్‌డేట్ కోల్పోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. ఈ ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు పనిచేయాలంటే వెంటనే అప్‌గ్రేడ్ చేసుకోవడమే మంచిది.