WhatsApp New Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై చాట్‌లో డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయకుండానే చూడొచ్చు..!

WhatsApp New Feature : వాట్సాప్ త్వరలో డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేయకుండానే లోపల ఉన్న కంటెంట్ వీక్షించేందుకు యూజర్లను అనుమతించనుంది. ఈ కొత్త ఫీచర్‌ని టెస్టింగ్ చేస్తున్నట్టు సమాచారం.

WhatsApp New Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. ఇప్పటివరకూ వాట్సాప్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ప్రవేశపెట్టింది. రాబోయే ఫీచర్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉండనుంది. వాట్సాప్ యూజర్లు తమ డాక్యుమెంట్లను షేర్ చేయడంలో మరింత వెసులుబాటు కల్పించనుంది. నివేదిక ప్రకారం.. వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. మెసేజింగ్ యాప్‌ త్వరలో డాక్యుమెంట్ ప్రివ్యూలను అందించనుంది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?

అంటే.. మీరు వాట్సాప్‌లో డాక్యుమెంట్ షేర్ చేసినప్పుడు.. అది ఓపెన్ చేయడానికి ప్రివ్యూ ఫొటోను చూస్తారు అనమాట.. ఇదో స్నీక్ పీక్ లాంటిది. మీ చాట్‌లో సరైన డాక్యుమెంట్ ఎంచుకునేలా చేస్తుంది. ఎందుకంటే.. ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయకుండానే అది ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. మీరు ఫొటోలు లేదా వీడియోలను షేర్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రివ్యూ ద్వారా పంపిన డాక్యుమెంట్‌లోని కంటెంట్‌ డౌన్‌లోడ్ చేయకుండానే చూడవచ్చు.

డాక్యుమెంట్ డౌన్‌లోడ్ చేయనక్కర్లేదు :
ప్రస్తుతం, మీరు వాట్సాప్‌లో ఒక ఫొటో లేదా వీడియోని డాక్యుమెంట్‌గా షేర్ చేస్తే.. రిసీవర్ దానిని డౌన్‌లోడ్ చేస్తే తప్ప వీక్షించలేరు. ఈ రాబోయే ఫీచర్‌తో అలాంటి సమస్య ఉండదు. అంతేకాదు.. వాట్సాప్ చాట్ చేసే కాంటాక్టులను సూచించే ఫీచర్‌పై కూడా పనిచేస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఇంతకుముందు, ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అయితే, లేటెస్ట్ బీటాఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐఓఎస్ యూజర్లు కూడా ఈ ఫీచర్‌ను పొందనున్నారు.

డబ్ల్యూఏబీటాఇన్ఫో స్క్రీన్‌షాట్ ప్రకారం.. ఎంపిక చేసిన బీటా టెస్టర్‌లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉండనుంది. చాట్‌ల లిస్టులో కిందిభాగాన ఉంటుంది. ఈ ఫీచర్ యూజర్లకు వారి ప్రస్తుత చాట్‌లకు అంతరాయం లేకుండా కొత్త చాట్ సులభంగా చేసుకోవచ్చు. కొత్త చాట్‌ అవసరం లేదని భావించే యూజర్లు అదే చాట్ లిస్టు దిగువన ఉన్న స్పెషల్ సెక్షన్ క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్ అధికారికంగా వాట్సాప్ ప్రకటించలేదు. అధికారిక ప్రకటన వరకు వేచిఉండాల్సిందే.

Read Also : JioBharat 4G Phone : జియోభారత్ 4జీ ఫోన్ యూజర్లకు కొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు