JioBharat 4G Phone : జియోభారత్ 4జీ ఫోన్ యూజర్లకు కొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం..!

JioBharat 4G Phone : రిలయన్స్ జియో జియోభారత్ 4జీ ఫోన్ కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ 4జీ ఫోన్ కొనుగోలుపై క్రికెట్ అభిమానులు అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.

JioBharat 4G Phone : జియోభారత్ 4జీ ఫోన్ యూజర్లకు కొత్త క్రికెట్ రీఛార్జ్ ప్లాన్.. మరెన్నో బెనిఫిట్స్ మీకోసం..!

Reliance Jio unveils new cricket recharge plan for JioBharat 4G phone

JioBharat 4G Phone : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (JioBharat 4G) ఫోన్ యూజర్ల కోసం కొత్త రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది. ఈ 4జీ ఫోన్ ప్రస్తుతం రూ. 999కి విక్రయిస్తోంది. అయితే, ఈ ఫోన్ అసలు రిటైల్ ధరలో ఎలాంటి తగ్గింపు లేనప్పటికీ, క్రికెట్ అభిమానులు మెరుగైన ప్రయోజనాలతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు.

Read Also : iPhone 16 Battery Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బ్యాటరీ వివరాలు లీక్.. ఐఫోన్ 15 ప్లస్ కన్నా చిన్న బ్యాటరీతో రావొచ్చు!

కొత్త/ఎంఎన్‌పీ లేదా ఇప్పటికే ఉన్న జియో సిమ్‌లో కొత్త రూ.234 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే యూజర్లు 2 నెలల ఫ్రీ ప్లాన్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 1, 2024న లేదా ఆ తర్వాత విక్రయించే జియోభారత్ ఫోన్లపై మాత్రమే వర్తిస్తుంది. పూర్తివివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసక్తి గల వినియోగదారులు ముందుగా ఏదైనా స్టోర్ నుంచి కొత్త జియోభారత్ 4జీ ఫోన్‌ను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత కొత్త జియోభారత్ ఫోన్‌లో జియో సిమ్ (New Jio SIM) లేదా ఇప్పటికే ఉన్న జియో సిమ్ వేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీ ప్రకారం.. ఆఫర్ పోర్ట్-ఇన్ (MNP) కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత యూజర్లు రూ. 234 ప్లాన్‌తో తమ ఫోన్‌ను రీఛార్జ్ చేసుకోవాలి. రోజుకు 0.5జీబీ డేటాతో పాటు 2 నెలల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్‌లను పొందవచ్చు.

2 నెలల ఫ్రీ ప్లాన్ పొందాలంటే? :
ఈ ప్యాక్‌తో కంపెనీ అదనంగా మరో 2 నెలల వ్యాలిడిటీని ఉచితంగా అందిస్తోంది. అయితే, ఆ సమయంలో డివైజ్‌లో ఉన్న సిమ్ 15 రోజుల రీఛార్జ్ (అర్హత) తర్వాత ఈ బెనిఫిట్ క్రెడిట్ అవుతుంది. అప్పుడే అదనంగా 2-నెలల ఉచిత ప్లాన్ యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసిన తర్వాత ఆటో-యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్ జియోభారత్ ఫోన్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుందని గమనించాలి. జియోభారత్ ఫోన్‌కు ఒకసారి మాత్రమే లేటెస్ట్ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఇటీవలే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే సహకారంతో ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌పై పనిచేస్తోందని వెల్లడించారు. జియో 2.0 విజన్‌ను సాకారం చేసే దిశగా కంపెనీ నిబద్ధతను వివరించారు.

భారత్ జీపీటీ ప్రోగ్రామ్ 2014 నుంచి ఐఐటీ బాంబే సహకారంతో చాట్‌జీపీటీ వంటి పెద్ద భాషా నమూనాల నుంచి ప్రేరణతో జనరేటివ్ ఏఐని ఉపయోగించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ జీపీటీ ప్రోగ్రామ్‌తో పాటు, టెలివిజన్ టెక్నాలజీలోకి జియో ప్రతిష్టాత్మక వెంచర్‌ను అంబానీ ఆవిష్కరించారు. టెలివిజన్‌ల కోసం సొంత ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ను అభివృద్ధి చేయడంలో కంపెనీ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15 కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకే ఈ డీల్‌ ఎలా పొందాలంటే?