WhatsApp Feature : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్ వస్తే.. మీ ప్రొఫైల్ ఫొటో ఇలా కనిపిస్తుంది..!
2022 కొత్త ఏడాదిలోనూ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది. వాట్సాప్ లో ఏదైనా కొత్త మెసేజ్ వచ్చినప్పుడు రెసిపెంట్స్ కు ఇలా నోటిఫికేషన్ వస్తుంది.

Whatsapp’s First Feature In 2022 Make Profile Photo Visible On Notifications
WhatsApp Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటిప్పుడూ కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వాడే యాప్ ఏదైనా ఉందంటే.. అది వాట్సాప్ అనడంలో సందేహం అక్కర్లేదు. సుమారు 2 బిలియన్లకు పైగా యూజర్లు వాట్సాప్ వాడుతున్నారు. 2022 కొత్త ఏడాదిలోనూ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది. 2022లోనూ ఆపిల్ iOS బీటా యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఫీచర్ సిస్టమ్ నోటిఫికేషన్‌లలో పంపినవారి ప్రొఫైల్ ఫొటోలను చూసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
రాబోయే రోజుల్లో అందరికి ఈ కొత్త ఫొటో ఫీచర్ అందుబాటులోకి రానున్నట్టు Wabetainfo వెల్లడించింది.దీని ప్రకారం.. వాట్పాప్ యూజర్లు చాట్‌లు లేదా గ్రూపుల నుంచి మెసేజ్ వచ్చినప్పుడు.. నోటిఫికేషన్‌లలో ప్రొఫైల్ ఫొటోలు కనిపించేలా కొత్త ఫీచర్ అనుమతిస్తుంది. కొంతమంది బీటా టెస్టర్లు iOS 15లో మాత్రమే iOS APIలను ఉపయోగిస్తున్నారు. అందుకే ముందుగా ఈ ఫీచర్ టెస్టింగ్ కోసం వారికి అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ లో ఏదైనా కొత్త మెసేజ్ వచ్చినప్పుడు రెసిపెంట్స్ కు నోటిఫికేషన్ వస్తుంది. అయితే నోటిఫికేషన్ బార్‌లో You Have A New Message అంటూ మెసేజ్ ప్రాంప్ట్ వస్తుంది. అది ఎవరూ అనేది ఓపెన్ చేసేంతవరకు తెలియదు. ఇకపై టెక్స్ట్ కు బదులుగా ప్రొఫైల్ ఫొటో కనిపించనుంది. ఎవరైనా మెసేజ్ చేయగానే వారి ప్రొఫైల్ ఫొటో నోటిఫికేషన్ బార్‌లో కనిపించనుంది. వాట్సాప్ తీసుకురాబోయే ఈ కొత్త ఫీచర్ ముందుగా ఐఫోన్ ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానుంది.
నోటిఫికేషన్ ఫొటో ఫీచర్ కోసం టెస్టింగ్ చేస్తున్నట్టు ఇటీవలే వాట్సాప్ ట్రాకర్ WABetaInfo రివీల్ చేసింది. వాట్సాప్ ఫీచర్ టెస్టింగ్ పూర్తి అయిన తర్వాత ముందుగా ఐఓఎస్ యూజర్లకు ఈ ఫొటో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఆ తర్వాతే ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫొటో ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. 2021 డిసెంబర్‌లో వాట్సాప్ తమ యూజర్ల కోసం ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసే కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్టు wabetainfo.com రివీల్ చేసింది. న్యూ కాన్సెప్ట్ Privacy Settings> Last Seen ‘Nobody’ ఎంచుకోవాలి. ఆ తర్వాత వారి ఆన్‌లైన్ స్టేటస్ హైడ్ చేసేందుకు యాప్ యూజర్లకు అనుమతిస్తుంది . ‘Online Status Hide’ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత యూజర్లు స్టెల్త్ మోడ్‌కు వెళ్లవచ్చు. వాట్సాప్ ప్రవేశపెట్టబోయే కొత్త అప్‌డేట్‌లలో ఇదో కొత్త ఫీచర్ రానుంది.
Read Also : CDS Chopper Crash : రాజ్ నాథ్ చేతిలో..రావత్ హెలికాఫ్టర్ ప్రమాద రిపోర్ట్