WhatsApp Voice Message : వాట్సాప్‌‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. వాయిస్ విన్నాకే పంపొచ్చు!

మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం మరో ఇంటెస్ట్రింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. WhatsApp Voice Message.. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ వాయిస్ రికార్డు చేసి విన్నాకే పంపొచ్చు.

WhatsApp Voice Message : ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తమ యూజర్లను ఆకట్టుకునేందుకు మరో ఇంటెస్ట్రింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. WhatsApp Voice Message.. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ వాయిస్ మీరే రికార్డు చేసుకోవచ్చు. ఆ వాయిస్ మెసేజ్ ముందు మీరు విన్నాకే షేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఉన్న ఆడియో రికార్డింగ్ మెసేజ్ ఫీచర్.. షేర్ అయ్యాక మాత్రమే వినేందుకు అవకాశం ఉంది. అలానే సరిగా లేకుంటే డిలీట్ చేయాల్సి వచ్చేది.

రాబోయే కొత్త ఫీచర్ అలా కాదు. పంపే ముందే మీ వాయిస్ రికార్డు చేసి మీరే విని.. బాగుంటే వెంటనే షేర్ చేసుకోవచ్చు. లేదంటే ఏమైనా మార్పులు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ యూజర్లు తమ ఆడియో మెసేజ్‌లను సులభంగా స్నేహితులకు పంపుకోవచ్చు. యూజర్ల మధ్య సమాచార మార్పిడి మెరుగ్గా ఉంటుందని వాట్సాప్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కొత్త వాయిస్ మెసేజ్ ఫీచర్‌లో ఇంటర్ ఫేస్ కూడా మార్పులు చేస్తోంది. గతంలో వాయిస్ మెసేజ్ ప్లే చేసినప్పుడు.. లైన్ మీద డాట్ సింబల్ మాత్రమే మూవ్ అయ్యేది. ఇప్పుడు కొత్తగా రాబోయే వాయిస్ మెసేజ్ ఫీచర్‌లో ఆడియో ప్లే అవుతుంటే.. మ్యూజిక్ వేవ్స్ కనిపిస్తాయి. ఏది ఏమైనా ఈ కొత్త ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. టెస్టింగ్ మోడ్ లో ఉందట.
Jio : జియో స్మార్ట్‌ఫోన్ ప్రీ బుకింగ్స్‌.. ఎప్పటి నుంచి అంటే..

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చారట.. అది కూడా టెస్టింగ్ కోసమేనట.. రెగ్యులర్ వాట్సాప్ యూజర్ల అందరికి అతి త్వరలోనే ఈ WhatsApp Voice Message ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. అంతేకాదండోయ్.. మరిన్ని కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకొస్తోంది. అందులో Messsage Reaction, Color Scheme, Web Preview, Data Transfer, Status Tab లాంటి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్లన్నీ టెస్టింగ్ లో ఉన్నాయట.. అది కంప్లీట్ అయ్యాక వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

ట్రెండింగ్ వార్తలు