మీ స్మార్ట్ ఫోన్లో ఎంతమంచిగా ఫోటోలు తీసినా సరే, DSLRకి సాటి వస్తుందా?

  • Published By: sreehari ,Published On : August 24, 2020 / 09:36 PM IST
మీ స్మార్ట్ ఫోన్లో ఎంతమంచిగా ఫోటోలు తీసినా సరే, DSLRకి సాటి వస్తుందా?

Updated On : August 30, 2020 / 7:06 AM IST

స్మార్ట్ ఫోన్.. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టిరావొచ్చు. అందమైన ప్రపంచంలో ఆకర్షణీయమైన ఫొటోలు తీసుకోవాలంటే అద్భుతమైన కెమెరాలు ఉండాల్సిందే. అలాంటి కెమెరా ఫీచర్లు ఉన్న ఫోన్లనే ఎక్కువగా ఇష్ట పడుతుంటారు. ఎంత దూరంలో నుంచి తీసినా షాట్ అయినా స్పష్టంగా కనిపించే కెమెరా ఫీచర్లనే ఎంచుకుంటారు.

మెరుగైన షాట్ ఫొటోలకే క్రేజ్ ఉంటుంది. మీరు వాడే ఫోన్లలో సరైన కెమెరా ఫీచర్లతో ఉంటే చాలు ప్రతిఒక్కరూ ఫొటోగ్రాఫర్లే అందమైన ప్రకృతిని కెమెరాలో బంధించవచ్చు. అన్ని ఫోన్లలో కెమెరాలు ఒకేలా ఉండవు. క్వాలిటీ కూడా బాగుండాలి. అలాంటి బెస్ట్ కెమెరా ఫోన్లలో ఎంచుకోవాలి.



ఏదైనా మంచి కెమెరా తీసుకుంటే 70-300mm టెలిఫోటో లెన్స్‌తో కూడిన పాత సోనీ A200 DSLR పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది. చౌకైన ధరకే క్వాలిటీ లెన్స్‌తో డజన్ల ఫోటోలను క్లికమనిపించవచ్చు. స్మార్ట్ ఫోన్ కెమెరాలు అద్భుతంగా సౌకర్యవంతంగా ఉంటాయి. గత దశాబ్దంలో కెమెరాల పర్ఫార్మెన్స్ అంతగా ఉండేది కాదు.

స్మార్ట్ ఫోన్ల రాకతో ఫొటో కెమెరాలు అరచేతిలోకి చేరిపోయాయి.. మిర్రర్‌లెస్ లేదా DSLR కెమెరాతో పోల్చితే.. తక్కువ కాంతిలో ఫొటో క్వాలిటీ, బోకె ఎఫెక్ట్స్ ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ మాక్రో ఫోటోగ్రఫీ ఇప్పటికీ నిజమైన కెమెరాలో గణనీయంగా మెరుగ్గా ఉన్నాయి. సాధారణంగా పెద్ద సెన్సార్ సైజుతో వివిధ లెన్స్‌లతో కెమెరాలు కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

స్మార్ట్ ఫోన్ కెమెరాల జాబితా తగ్గిపోతోంది. శాంసంగ్ గెలాక్సీ Note 20 Ultra తెలివైన 100x Space Zoom మార్కెట్లోకి రావడంతో కెమెరా ఫోన్లకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. కిలోమీటర్ల దూరం నుంచి కూడా అద్భుతమైన షాట్లు తీయగల ఫొటో కెమెరా ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి.



ఇప్పటికీ అసలైన 100x ఆప్టికల్ Zoom కాదు. కెమెరా లెన్స్ సెటప్ 4x ఆప్టికల్ జూమ్‌ను మాత్రమే అందిస్తుంది. డిజిటల్ ప్రాసెసింగ్, క్రాపింగ్ ద్వారా వర్క్ చేస్తుంది. S20 Ultra ‘లాస్‌లెస్ హైబ్రిడ్’ 4x-10x Zoom స్థాయికి మించి పనిచేస్తుంది. గెలాక్సీ S20, Note 20 Ultra ఫోన్ కెమెరాలలో £ 1,000కు ఖర్చు అవుతుంది.

కొత్త ఫోన్ లేదా మీరు గత కొన్ని ఏళ్లుగా మీ ఫోన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేస్తే.. 12 నెలల అప్‌గ్రేడ్ మాక్రో ఫోటోగ్రఫీ.. స్మార్ట్‌ఫోన్‌లో చక్కగా వర్క్ చేయదు. శాంసంగ్ గెలాక్సీ A51 ఫోన్‌లను మాక్రో మాడ్యూల్‌తో 5MP రిజల్యూషన్‌తో ప్రారంభించింది. బోకేహ్ కూడా స్మార్ట్ ఫోన్ డీప్ సెన్సార్లకు మార్చవచ్చు.



AI టెక్నాలజీతో తక్కువ-కాంతి ప్రాసెసింగ్ డర్టీ ఫొటోలను యాక్సస్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ లేని కంటికి డిజిటల్ ఇండికేషన్స్ క్లారిటీగా కనిపిస్తాయి. వీడియోల విషయానికి వస్తే.. ఫోన్ తయారీదారులు తరచుగా 4K Ultra HD వీడియో క్లిప్‌లను షూట్ చేయొచ్చు.. డివైజ్‌ల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తారు.4k ఫుటేజీని ఫుజిఫిల్మ్ X-T4, సోనీ A7 III లేదా Nikon Z6 వంటి కెమెరాలో తీసిన 4K ఫుటేజ్‌తో పోల్చి చూడొచ్చు.

పగలైన రాత్రి ఫోన్ వీడియో అద్భుతంగా తీయొచ్చు. ఎంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ వచ్చినా.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నా స్మార్ట్‌ఫోన్ ఇప్పటికీ మీ సాంప్రదాయ DSLRని పూర్తిగా భర్తీ చేయలేదని మాత్రం గుర్తించుకోవాలని అంటున్నారు కెమెరాల విశ్లేషుకులు.