Wikipedia Donations : విరాళాలు ఇవ్వాలంటున్న వికీపీడియా.. ఎందుకో తెలుసా?
Wikipedia Donations : ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సమాచారం కావాలంటే ప్రతిఒక్కరూ వికిపీడియాకు వెళ్లి వెతికేస్తుంటారు. ప్రతి అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా అప్‌డేట్ చేస్తుంటారు.

Wikipedia Issued A Special Message For Its Readers, Said Donate Now To Make Our Future
Wikipedia Donations : ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సమాచారం కావాలంటే ప్రతిఒక్కరూ వికిపీడియాకు వెళ్లి వెతికేస్తుంటారు. ప్రతి అంశానికి సంబంధించిన డేటా అందుబాటులో ఉండేలా అప్‌డేట్ చేస్తుంటారు. ఈ వికిపీడియా ఉచితంగా అందించే సర్వీసు.. ఎవరైనా ఎన్నిసార్లు అయినా ఈ పేజీని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త వికీపీడియా పేజీలను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రముఖ వ్యక్తుల నుంచి సంస్థలు, స్థలాలు, ప్రాంతం, దేశం ఇలా అన్నింటికి గురించి వికీపీడియాలో సమాచారం లభ్యం అవుతుంది. అలాంటి వికీపీడియాలో ఏళ్ల తరబడి ఉచితంగా సర్వీసు అందిస్తున్న ఆర్థికపరంగా ఎలాంటి లబ్ధిలేదు.
ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ వికీపీడియాను రన్ చేస్తున్నారు. అయితే ఇందులో ఏదైనా డేటాను క్రియేట్ చేయాలంటే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. కానీ, ఇప్పుడు వికీపీడియా తమ సంస్థ అభివృద్ధి కోసం పాఠకులకు ఒక మెసేజ్ పంపుతోంది. ఈ మెసేజ్ బుధవారం నుంచి వికీపీడియాలోని ఏదైనా పేజీని ఓపెన్ చేసినప్పుడల్లా మీకు అది కనిపిస్తుంది. ఈ మెసేజ్ ద్వారా వికీపీడియా తన పాఠకుల నుంచి విరాళాలను అభ్యర్థిస్తోంది. ప్రస్తుతం వికీపీడియా పాఠకులందరికీ ఒక ప్రత్యేక సందేశాన్ని రిలీజ్ చేసింది.

Wikipedia Issued A Special Message For Its Readers, Said Donate Now To Make Our Future
అందులో ఏముందంటే.. ‘ఈ బుధవారం రోజున మేం వికీపీడియా స్వేచ్ఛ కోసం సాయాన్ని కోరుతున్నాం. మా పాఠకుల్లో 98 శాతం మంది ఎలాంటి ఆర్థిక సహాయం అందించడం లేదు. వారు కేవలం సమాచారం అందుకుంటారు. మాకు విరాళం అందించిన ప్రత్యేక పాఠకులలో మీరు ఒకరైతే.. మేం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు ఈ రోజు కేవలం రూ.75 రూపాయలు విరాళంగా అందిస్తారని కోరుతున్నాం. మీరు అందించే ఈ సాయంతో వికీపీడియాను ఏళ్ల తరబడి నిర్వహించేందుకు మద్దతు ఇచ్చినవారు అవుతారు.
ఈ మెసేజ్ కనిపించినప్పుడు.. దయచేసి క్రిందికి స్క్రోల్ చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. వికీపీడియా మీకు రూ. 75 విరాళం కోరుతోంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ మొత్తంలో విరాళంగా ఇవ్వాలన్నా ఇవ్వొచ్చు. రూ.75 నుంచి రూ.300, రూ. 500, రూ.1,000, రూ.1,500, రూ.3,000, రూ. 5000, ఆపై ఎంత మొత్తంలో విరాళంగా ఇస్తారో ఇవ్వొచ్చు. డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం ఉంది. మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా కూడా విరాళాన్ని అందించవచ్చు. ఒక్క నిమిషం మాకోసం వెచ్చించి విరాళం ఇవ్వండి. విశ్వసనీయమైన, తటస్థ సమాచారాన్ని యాక్సస్ చేసుకునేలా ప్రపంచానికి చేయూతనిద్దాం. ధన్యవాదాలు’ అనే మెసేజ్ వికీపీడియా పేజీలో డిస్‌ప్లే అవుతుంది.
Read Also : OnePlus 10T : 2022లో వన్‌ప్లస్ నుంచి చివరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇదే..!