Xiaomi 13 Ultra : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Ultra : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా కొత్త మోడల్ లాంచ్ కానుంది. సరికొత్త ఫీచర్లతో షావోమీ అల్ట్రా (Xiaomi 13 Ultra Launch) ఫోన్ వస్తోంది. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Ultra : ఏప్రిల్ 18న షావోమీ 13 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi 13 Ultra to launch on April 18_ What to expect

Updated On : April 14, 2023 / 9:11 PM IST

Xiaomi 13 Ultra : చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ (Xiaomi) ఏప్రిల్ 18న జరగబోయే ఈవెంట్‌లో (Xiaomi 13 Ultra)ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్ చైనా, గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందు, కంపెనీ షావోమీ 13 Ultra కొత్త Leica లెన్స్‌లు ఉన్నాయని ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక టీజర్ ప్రకారం.. ఫోన్ వెనుక భాగంలో 4 సెన్సార్‌లు, లైకా వేరియో-సమ్మిక్రాన్ బ్రాండింగ్‌తో పెద్ద కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది.

షావోమీ 13 అల్ట్రా ఫీచర్లు (అంచనా) :
రాబోయే షావోమీ 13 అల్ట్రా ఫోన్ Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ శాంసంగ్ నుంచి 6.7-అంగుళాల QHD+ LPTO E6 AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP68 సర్టిఫికేషన్‌తో రానుంది. స్టోరేజీ గరిష్టంగా 512GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో 16GB వరకు RAMని పొడిగించుకునే అవకాశం ఉంది.

Xiaomi 13 Ultra to launch on April 18_ What to expect

Xiaomi 13 Ultra to launch on April 18

Read Also :  Flipkart Summer Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్.. కేవలం రూ.12,999 మాత్రమే.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హ్యాండ్‌సెట్ MIUI 14లో రన్ కావచ్చు. షావోమీ 13 అల్ట్రా 4,900mAh బ్యాటరీని 90వాట్ల వైర్డు ఛార్జింగ్ స్పీడ్‌తో పాటు 50వాట్లకు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రానుంది. కెమెరా విషయానికొస్తే.. షావోమీ 13 Ultra 1-అంగుళాల 50MP సోనీ IMX989 సెన్సార్‌తో f/1.8 అపెర్చర్‌తో వస్తుంది. 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 50MP టెలిఫోటో కెమెరాతో రావొచ్చు. షావోమీ స్మార్ట్‌ఫోన్‌తో లైకా-ట్యూన్డ్ ఆప్టికల్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.

సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ముందు భాగంలో 32MP కెమెరాతో వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ చైనాలో అందుబాటులోకి రానుంది. ఆ తరువాత రాబోయే నెలల్లో గ్లోబల్ మార్కెట్‌లలో లభ్యమవుతుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అనేది షావోమీ వెల్లడించలేదు. ఇటీవలే దేశంలో Xiaomi 13 ప్రోని లాంచ్ చేసింది. షావోమీ అభిమానులు ప్రస్తుతానికి Xiaomi 13 Ultra కోసం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

Read Also : Asus ROG Phone 7 Series : భారత్‌కు ఆసుస్ లేటెస్ట్ గేమింగ్ 5G ఫోన్.. స్పెషల్ ఫీచర్లతో ROG ఫోన్ 7 సిరీస్.. ధర ఎంతంటే?