Xiaomi 14 Series
Xiaomi 14 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇటీవలి కాలంలో షావోమీ 3 స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. అందులో షావోమీ 14 సీవీ, షావోమీ 14, షావోమీ 14 అల్ట్రా ఫోన్ ఉన్నాయి. ఇందులో ఈ 3 ఫోన్లు డిజైన్, ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్‌లు. కానీ, ఈ మూడు వేర్వేరు ఫోన్లలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి. ఏది కొంటే బెటర్? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. సన్నని డివైజ్, ప్రీమియం లుక్ :
షావొమీ 14 సివి ఫోన్ మూడింటిలో చాలా తేలికైనది. సన్నగా ఉంటుంది. చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్యాషన్-ట్రెండీ ఫోన్ల కోసం చూస్తుంటే ఇది మీకోసమే. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందించే బ్యాక్ పార్టుతో అద్భుతంగా ఉంటుంది. షావోమీ 14 కూడా సివిక్ కన్నా చాలా బరువైనది. అలాగే ప్రీమియం కూడా.
డిజైన్ క్వాలిటీ విషయానికొస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఫోన్ చూసేందుకు చాలా ఫ్లాగ్‌షిప్ మాదిరిగా అనిపిస్తుంది. షావోమీ 14 అల్ట్రా అతిపెద్దది. బ్యాక్ సైడ్ కెమెరా హంప్ ఉంది. ఆర్టిఫీషియల్ లెదర్‌తో కూడిన మెటీరియల్ ప్రీమియం-లుకింగ్ ఫినిషింగ్ కలిగి ఉంది. ఇది బరువైనది కానీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవసరమైన వ్యక్తి కోసం తయారు చేయబడింది.
2. స్క్రీన్ టైమ్, డిస్‌ప్లే :
షావోమీ 14 సివి 6.55-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే కలర్‌ఫుల్ ఉంటుంది. పవర్‌ఫుల్ కూడా. గేమింగ్‌కు బెస్ట్ ఫోన్.. షావోమీ 14లో 6.36-అంగుళాల LTPO అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పవర్ సేవింగ్ కోసం డైనమిక్‌గా అడ్జెస్ట్ చేస్తుంది.
షావోమీ 14 అల్ట్రాలో 6.73-అంగుళాల భారీ LTPO అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. బ్రైట్‌నెస్, హై రిజల్యూషన్ కలిగి ఉంది. మూవీలు చూడటానికి, ఫొటోలను ఎడిట్ చేయడం లేదా గేమ్‌లు ఆడటానికి సరిపోతుంది. మూడింటిలో ఇదే అత్యుత్తుమ స్క్రీన్ అని చెప్పొచ్చు.
3. చిప్‌సెట్, పర్ఫార్మెన్స్ :
షావోమీ 14 సివిక్ స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 3 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. రోజువారీ టాస్కులు, సోషల్ మీడియా, గేమింగ్ కోసం వినియోగించుకోవచ్చు. షావోమీ 14 మరింత పవర్ ఆదా చేసే స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌తో వస్తుంది. అత్యుత్తమ పర్ఫార్మెన్స్ గేమింగ్, ఈజీ మల్టీ టాస్కింగ్‌ను అందిస్తుంది. షావోమీ 14 అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 కూడా ఉంది.
4. కెమెరా ఫీచర్లు :
షావోమీ 14 సివిలో డ్యూయల్ రియర్ కెమెరా, డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ కెమెరా బెస్ట్. రెగ్యులర్ ఫోటోగ్రఫీకి బ్యాక్ కెమెరా కూడా బెస్ట్. షావోమీ 14 లైకా-బ్యాడ్జ్ ఉన్న 3 బ్యాక్ కెమెరాలతో వస్తుంది. ఫొటోలు చాలా నేచురల్‌గా కనిపిస్తాయి.
ముఖ్యంగా నైట్ షాట్లు అద్భుతంగా వస్తాయి. మెరుగైన పోర్ట్రెయిట్స్ కూడా పొందవచ్చు. షావోమీ 14 అల్ట్రా ఫోటోగ్రఫీలో ముందుంది. ఒక అంగుళం మెయిన్ సెన్సార్, వేరియబుల్ ఎపర్చర్‌తో 4 బ్యాక్ కెమెరాలతో వస్తుంది. ప్రో-లెవల్ ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు.
5. బ్యాటరీ లైఫ్.. :
షావోమీ 14 సివి 67W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 4700mAh బ్యాటరీతో వస్తుంది. చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. రోజంతా వస్తుంది. షావోమీ 14 మోడల్ 4610mAh బ్యాటరీతో 90W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. షావోమీ సివి కన్నా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. షావోమీ 14 అల్ట్రా ఫోన్ భారీ 5000mAh బ్యాటరీతో వస్తుంది. వరుసగా 80W, 90W వేగంతో వైర్‌లెస్, కేబుల్ ఛార్జింగ్‌తో వస్తుంది.
మూడింటిలో గరిష్ట బ్యాటరీ బ్యాకప్, ఎక్కువ సమయం ఛార్జ్‌ను అందిస్తుంది. అద్భుతమైన స్పెషిఫికేషన్లు, పవర్‌ఫుల్ ఫోన్ కావాలంటే.. షావోమీ 14 బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన కెమెరా, స్క్రీన్, బ్యాటరీ లైఫ్ కలిగిన బెస్ట్ ఫోన్ కావాలంటే.. షావోమీ 14 అల్ట్రా బెస్ట్ అని చెప్పొచ్చు. మూడు ఫోన్లు అద్భుతమైనవే. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఏదైనా కొనేసుకోవచ్చు.