Xiaomi 14 Series Launch : మార్చి 7న షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది.. మొత్తం 3 మోడళ్లలో లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలివే..!

Xiaomi 14 Series Launch : భారత మార్కెట్లోకి షావోమీ 14 సిరీస్ వచ్చేస్తోంది. మార్చి 7న ఈ కొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ధృవీకరించింది. షావోమీ ఫోన్ల స్పెషిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Xiaomi 14 series India launch set for March 7, check out specs and expected price

Xiaomi 14 Series Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమీ 14 సిరీస్ మోడల్ భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. ఎట్టకేలకు షావోమీ 14 లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 7న ఈ షావోమీ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఇప్పటికే కంపెనీ రివీల్ చేసింది.

Read Also : Apple iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

చైనాలో మొత్తం మూడు మోడళ్లను రిలీజ్ చేయగా.. అదే మోడల్స్ భారత మార్కెట్లోనూ లాంచ్ చేయనుందా? లేదా అనేది షావోమీ వెల్లడించలేదు. భారత మార్కెట్లోకి స్టాండర్డ్, అల్ట్రా మోడల్స్ మాత్రమే రావచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి. కొత్త షావోమీ సిరీస్ మొదట ఫిబ్రవరి 25న గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత వచ్చే నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. షావోమీ 14 సిరీస్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులు స్పెసిఫికేషన్‌ల వివరాలను ఓసారి లుక్కేయండి..

షావోమీ 14, ప్రో, అల్ట్రా : స్పెషిఫికేషన్లు, ధర (అంచనా) :
షావోమీ 14 సిరీస్ 6.36-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్రో మోడల్ 6.73-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. రెండు వేరియంట్‌లు ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. 3000నిట్స్ గరిష్ట ప్రకాశంతో 120హెచ్‌జెడ్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తాయి. షావోమీ 14 సిరీస్ హుడ్ కింద సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌ను అందిస్తుంది. యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీని 16జీబీ వరకు ర్యామ్ అందిస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కూడా కలిగి ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కస్టమైజ్డ్ లైకా సమ్మిలక్స్ లెన్స్‌తో లైట్ హంటర్ 900 సెన్సార్ హౌసింగ్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ రెండు ఫోన్‌లు గత మోడల్‌ల మాదిరిగానే అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయగలవు. షావోమీ 14 ప్రో వెర్షన్ వేరియబుల్ ఎపర్చరును అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు 50ఎంపీ టెలిఫోటో సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 32ఎంపీ సెల్ఫీ షూటర్‌ను పొందవచ్చు.

వనిల్లా షావోమీ 14 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,610ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అయితే, షావోమీ ప్రో వెర్షన్ 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ 4,880ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అంతేకాకుండా, రెండు మోడల్‌లు 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తాయి. గత ఏడాది ధరలతో పోలిస్తే.. షావోమీ 14 సిరీస్ ధర రూ. 50వేల కన్నా తక్కువగా ఉంటుందని అంచనా. అయితే షావోమీ 14 ప్రో ధర రూ. 80వేల విభాగంలో ఉండవచ్చు.

Read Also : OnePlus Nord CE 3 Lite 5G : కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?

ట్రెండింగ్ వార్తలు