Xiaomi Smart TV A32 Model : కొత్త షావోమీ స్మార్ట్‌టీవీ A32 మోడల్ వచ్చేసిందోచ్.. ధర రూ. 12,499 మాత్రమే..!

కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ఈ అప్‌గ్రేడ్‌తో 24శాతం వరకు ఎక్కువ పవర్ సేవ్ చేస్తుంది. వ్యూ ఎక్స్‌పీరియన్స్ స్మార్ట్ ఆప్షన్‌గా రానుందని షావోమీ తెలిపింది.

Xiaomi Smart TV A32 Model : కొత్త షావోమీ స్మార్ట్‌టీవీ A32 మోడల్ వచ్చేసిందోచ్.. ధర రూ. 12,499 మాత్రమే..!

Xiaomi 32-inch Smart TV A32 2024 ( Image Credit : Google )

Updated On : May 22, 2024 / 10:53 PM IST

Xiaomi Smart TV A32 Model : కొత్త స్మార్ట్‌టీవీ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ ఇండియాలో కొత్త 32-అంగుళాల స్మార్ట్ టీవీ A32 2024 లాంచ్ చేసింది. ఈ బ్రాండ్ బడ్జెట్ ఆఫర్ ధర రూ. 15వేలు కన్నా తక్కువగా ఉంటుంది.

Read Also :OnePlus 12R Price Drop : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ ప్లాట్ డిస్కౌంట్ పొందాలంటే?

గత మోడల్‌లతో పోలిస్తే.. 4-స్టార్ బీఈఈ సర్టిఫికేషన్‌తో కొత్త స్మార్ట్‌టీవీ మరింత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందని కంపెనీ చేస్తోంది. ఈ కొత్త షావోమీ స్మార్ట్‌టీవీ ఎ32, 2024 ఎడిషన్ మెటల్ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. షావోమీ లోకల్ వివిడ్ పిక్చర్ ఇంజిన్‌తో 32-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. కలర్, ఇమేజ్ ‘ప్రతి ఫ్రేమ్‌తో స్పష్టత’ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

8జీబీ స్టోరేజీలో లాటెన్సీ మోడ్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై మిరాక్యాస్ట్ సహా మల్టీ కనెక్టివిటీ పోర్ట్‌లతో ఉంటుంది. గూగుల్ టీవీ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. షావోమీ స్మార్ట్‌టీవీ ఎ32 సాధారణ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తుంది. టెలివిజన్ 20డబ్ల్యూ డాల్బీ ఆడియో టెక్నాలజీతో పాటు డీటీఎస్ వర్చువల్ ఎక్స్ సపోర్టు చేస్తుంది.

షావోమీ లేటెస్ట్ టీవీ 4-స్టార్ బీఈఈ సర్టిఫికేషన్‌తో మరింత శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది. గత మోడల్ 2-స్టార్ రేటింగ్ నుంచి అప్‌గ్రేడ్ చేసింది. ఈ అప్‌గ్రేడ్‌తో 24శాతం వరకు ఎక్కువ పవర్ సేవ్ చేస్తుంది. వ్యూ ఎక్స్‌పీరియన్స్ స్మార్ట్ ఆప్షన్‌గా రానుందని షావోమీ తెలిపింది.

అత్యంత అడ్వాన్స్‌‌డ్ వెర్షన్ :
ఈ ఎడిషన్ టీవీ కంటెంట్ వినియోగానికి షావోమీ టీవీ ప్లస్ అత్యంత అడ్వాన్స్‌డ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ యూనివర్సల్ సెర్చ్‌తో కలిసి ఐఎమ్‌డీబీ రేటింగ్‌లతో కలిసి పనిచేయడంపై యూజర్లకు వ్యూ ఆప్షన్లను అందిస్తుంది. షావోమీ టీవీ ప్లస్ ఇంటర్‌ఫేస్ మెరుగైన యూజర్ ఇంటరాక్షన్‌ను అందిస్తుంది.

ఇప్పుడు 30 కన్నా ఎక్కువ ఓటీటీ యాప్‌లు, 90 ప్లస్ లైవ్ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అనుమతిస్తుంది. షావోమీ టీవీ ప్లస్ కంపెనీ వివరాల ప్రకారం.. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా 150కు పైగా ఛానెల్‌లలో ఫ్రీ లైవ్ స్ట్రీమింగ్ టీవీని వీక్షించేందుకు యూజర్లను అనుమతిస్తుంది. కిడ్స్ మోడ్, లైవ్ స్పోర్ట్స్, స్మార్ట్ రికమండేషన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ధర విషయానికొస్తే.. షావోమీ స్మార్ట్‌టీవీ A32 2024 ఎడిషన్ ప్రారంభ ధర రూ. 12,499 వద్ద అందుబాటులో ఉంటుంది. మే 28 నుంచి ఎంఐ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, షావోమీ రిటైల్ పార్టనర్లలో విక్రయానికి రానుంది. షావోమీ 55-అంగుళాల టీవీని కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు సంస్థ ఎమ్.కామ్ సైట్ ద్వారా ఎంఐ టీవీ క్యూఎల్ఈడీ 4కె మోడల్‌ను రూ. 59,999కి కొనుగోలు చేయొచ్చు. షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్50 2023 ఎడిషన్ కూడా రూ. 32,999కి అమ్మకానికి ఉంది.

Read Also : Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, బ్యాంకు ఆఫర్లు ఇవే