Xiaomi Mix Fold 3 Launch : ఆగస్టు 14న షావోమీ నుంచి మడతబెట్టే ఫోన్ వస్తోంది.. మిక్స్ ఫోల్డ్ 3 ఫోన్ ఇదిగో.. దిమ్మతిరిగే ఫీచర్లు..!

Xiaomi Mix Fold 3 Launch : షావోమీ నుంచి మడతబెట్టే ఫోన్ వచ్చేస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో మిక్స్ ఫోల్డ్ 3 ఫోన్ రానుంది. ఈ ఫోన్ ఆగస్టు 14న చైనాలో లాంచ్ కానుంది.

Xiaomi Mix Fold 3 Confirmed to Launch on August 14, Design Revealed in Official Renders

Xiaomi Mix Fold 3 Launch : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ (Xiaomi) మిక్స్ ఫోల్డ్ 3 ఫోన్ ఆగస్టు 14న చైనాలో లాంచ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ మిక్స్ ఫోల్డ్ 2, MI మిక్స్ ఫోల్డ్ మాదిరిగా ఉంటుంది. అలాగే, షియోమి నుంచి మూడో ఫోల్డబుల్ ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మిక్స్ ఫోల్డ్ 3 పూర్తి డిజైన్‌ను అధికారిక ఫొటోలను కూడా లాంచ్ చేసింది. వెనుక వైపున లైకా-బ్రాండెడ్ క్వాడ్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. కొద్దిగా కర్వడ్ కార్నర్ కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది.

షావోమీ మిక్స్ Fold 3 నేరుగా Samsung Galaxy Z Fold 5, Honor Magic V Fold, Pixel Fold వంటి పోటీపడుతుంది. (Xiaomi) వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 ఆగస్టు 14న చైనాలో ఆవిష్కరించనుందని ప్రకటించారు. లాంచ్ ఈవెంట్ స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:00 గంటలకు (సాయంత్రం 4:30 pm IST) లాంచ్ కానుంది. బ్రాండ్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో ఫస్ట్-లుక్ రెండర్‌లను పోస్ట్ చేసింది.

Read Also : Realme 11 5G Launch : రియల్‌మి 11 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఆన్‌లైన్‌లో ఫీచర్లు లీక్.. భలే ఉంది భయ్యా ఫోన్..!

షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 డిజైన్‌ను అన్ని కోణాల నుంచి మడతపెట్టిన అన్‌ఫోల్డ్ మోడ్‌లలో ప్రదర్శిస్తుంది. రెండర్‌లు హ్యాండ్‌సెట్‌ను బ్లాక్, క్రీమ్ షేడ్స్‌లో కొద్దిగా కర్వడ్ స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. షావోమీ మిక్స్ ఫోల్డ్ 3, మిక్స్ ఫోల్డ్ 2తో పోలిస్తే.. భారీ చతురస్రాకారపు కెమెరా మాడ్యూల్‌ను ప్యాక్ చేసినట్లు కనిపిస్తోంది. LED ఫ్లాష్‌తో పాటు లైకా-బ్రాండెడ్ క్వాడ్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

Xiaomi Mix Fold 3 Confirmed to Launch on August 14, Design Revealed in Official Renders

గత నివేదికల ప్రకారం.. షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 మోడల్ 8.02-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,400 పిక్సెల్‌లు) ఇంటర్నల్ డిస్‌ప్లే, 6.5-అంగుళాల కవర్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. రెండు స్క్రీన్‌లు 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను అందించగలవు. ఆక్టా-కోర్ Qualcomm Snapdragon 8 Gen 2 SoCతో పాటు 16GB వరకు LPDDDR5x RAM, 1TB వరకు UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజీతో రన్ అవుతుందని భావిస్తున్నారు.

50W లేదా 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీని రానుందని భావిస్తున్నారు. శాంసంగ్ రెండు ఫోల్డబుల్ డివైజ్‌లను ఆవిష్కరించిన వారాల తర్వాత షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 లాంచ్ కానుంది. Galaxy Z Flip 5, Galaxy Z Fold 5 మోడల్స్ కొత్త షావోమీ ఫోల్డబుల్ చైనా వెలుపలి మార్కెట్‌లలో అమ్మకానికి వస్తే.. ఫోల్డబుల్ ప్రదేశంలో మరింత పోటీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 16 Pro : ఐఫోన్ 15 ఇంకా రానే లేదు.. ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మోడల్స్ ఫీచర్లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు