Xiaomi Phones
Xiaomi Phones : షావోమీ ఫోన్ యూజర్లకు అలర్ట్.. ప్రపంచవ్యాప్తంగా Xiaomi, Redmi, POCO ఫోన్లకు సంబంధించి అప్‌డేట్స్ నిలిచిపోనున్నాయి. ఈ మేరకు కంపెనీ ఇటీవలే ఎండ్-ఆఫ్-లైఫ్ స్టేటస్‌లో ఫోన్ల అధికారిక జాబితాను ప్రకటించింది.
ఈ షావోమీ మోడల్ ఫోన్లలో ఇకపై సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందుకోలేవు. కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ అయినా సరే సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా రావు. ఇంతకీ షావోమీ అప్‌డేట్ నిలిపివేసే ఫోన్లు ఏంటి? ఏయే మోడల్స్ ఉన్నాయి.. ఫుల్ లిస్ట్ ఓసారి లుక్కేయండి.
షావోమీ ఈ ఫోన్లలో ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, హైపర్ఓఎస్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీకి సంబంధించి నెలవారీ ప్యాచ్‌లకు కూడా నిలిపివేస్తోంది.
పోకో F4 GT ఫోన్ ఏప్రిల్ 2022లో ఆండ్రాయిడ్ 12తో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14, హైపర్ఓఎస్ 2.0కి అప్‌గ్రేడ్ అయింది. అయితే, ఇప్పుడు ఎలాంటి కొత్త అప్‌డేట్స్ ఉండవు.
సాధారణంగా షావోమీ ఫ్లాగ్‌షిప్ రెండు లేదా మూడు ఏళ్ల మధ్య సాఫ్ట్‌వేర్ సపోర్టు అందిస్తుందని గమనించాలి. దాదాపు అన్ని ఆండ్రాయిడ్ బ్రాండ్‌లు సపోర్టు పొందుతాయి.
ముఖ్యంగా మిడ్ రేంజ్ కేటగిరీ ఫోన్లతో పాటు ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఒకటి లేదా రెండు నెలలు అదనంగా సాఫ్ట్‌వేర్ సపోర్టు పొందవచ్చు.