Best AI Smartphones : వారెవ్వా.. AI ఫీచర్లతో రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. కొంటే ఇలాంటి ఫోన్లు కొనాల్సిందే..!
Best AI Smartphones : ఏఐ ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

Best AI Smartphones
Best AI Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అత్యుత్తమ ఫీచర్లతో కొత్త ఫోన్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో సరికొత్త ఏఐ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి.
Read Also : Motorola Edge 50 Ultra : భలే డిస్కౌంట్ భయ్యా.. ఈ మోటోరోలా అల్ట్రా 5G ఫోన్ అతి తక్కువ ధరకే..!
ప్రత్యేకించి ఏఐ ఫీచర్లు ఉన్న ఫోన్లకు ఫుల్ క్రేజ్ పెరుగుతోంది. ఏఐ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? రూ. 40వేల లోపు బెస్ట్ ఏఐ ఫీచర్ ఫోన్ల జాబితాను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఏఐ ఫీచర్ ఫోన్ కొనేసుకోవచ్చు.
రియల్‌మి GT6 ఏఐ ఫీచర్ ఫోన్ :
రియల్‌మి నుంచి ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఏఐ ఎరేజర్, ఏఐ స్మార్ట్ లూప్, ఏఐ స్మార్ట్ కటౌట్, ఏఐ డాక్యుమెంట్స్, స్మార్ట్ సైడ్‌బార్, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ రికార్డింగ్ సమ్మరీ, డ్యూయల్ మోడ్ ఆడియో వంటి ఫీచర్లతో వస్తుంది. రూ. 35వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ రియల్‌మి ఫోన్ 6.78-అంగుళాల FHD+ LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. కెమెరా విషయానికొస్తే.. రిఫ్రెష్ రేట్ 120Hz, బ్యాక్ సైడ్ 50MP కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కూడా ఉంది. పవర్ విషయానికి వస్తే.. 5500mAh బ్యాటరీ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ A55 ఏఐ ఫీచర్ ఫోన్ :
ఈ శాంసంగ్ ఫోన్ ఏఐ ఫీచర్ల విషయానికి వస్తే.. సర్కిల్ టు సెర్చ్, నోట్ లేదా బ్రౌజింగ్ అసిస్ట్, ట్రాన్స్క్రిప్ట్ అసిస్ట్, పోర్ట్రెయిట్ స్టూడియో, స్కెచ్ టు ఇమేజ్ వంటి ఏఐ ఫీచర్లను పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్‌ను రూ. 40వేల లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు.
అదే సమయంలో, ఈ ఫోన్ 6.78-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, శాంసంగ్ ఎక్సినోస్ 1480 చిప్‌సెట్ కలిగి ఉంది. శాంసంగ్ ఫస్ట్ కెమెరా 50MP, ఫ్రంట్ కెమెరా 32MP పవర్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
వివో V50 ఏఐ ఫీచర్ ఫోన్ :
ఈ వివో V50 ఫోన్ రూ.40వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఏఐ ఫోన్‌ల లిస్టులో లేటెస్ట్ ఫోన్. గూగుల్ జెమిని, ఏఐ సూపర్‌లింక్, లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, ఏఐ ట్రాన్స్‌స్క్రిప్ట్, ఏఐ స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ వంటి ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. వివో V50 ఏఐ ఫోన్ రూ.37వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ మొబైల్ ఫోన్ 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ప్రైమరీ కెమెరా 50MP, ఫ్రంట్ కెమెరా 50 MP కూడా ఉంది. 6000mAh బ్యాటరీ కలిగి ఉంది.