Xiaomi First 5G Phone : రూ.10వేల లోపు ధరలో షావోమీ ఫస్ట్ 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi First 5G Phone : కొత్త చిప్‌సెట్‌తో బడ్జెట్ 5జీ ఫోన్‌ను షావోమీ ఆవిష్కరించిన మొదటి ఫోన్లలో ఒకటి. ఇప్పుడు అధికారికంగా రెడ్‌మి ఎ4 5జీ పేరుతో లాంచ్ చేయనుంది.

Xiaomi First 5G Phone : రూ.10వేల లోపు ధరలో షావోమీ ఫస్ట్ 5జీ ఫోన్ వస్తోంది.. లాంచ్ ఎప్పుడు? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

Xiaomi Unveils Its First 5G Phone In India ( Image Source : Google )

Updated On : October 19, 2024 / 6:59 PM IST

Xiaomi First 5G Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో రూ. 10వేల లోపు ధరలో షావోమీ ఫస్ట్ 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2024 (IMC 2024) కార్యక్రమంలో షియోమీ క్వాల్‌కామ్‌ భాగస్వామ్యంతో ఈ 5జీ ఫోన్ ప్రకటించింది. కొత్త చిప్‌సెట్‌తో బడ్జెట్ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించిన మొదటి ఫోన్లలో ఒకటి. ఇప్పుడు అధికారికంగా రెడ్‌మి ఎ4 5జీ పేరుతో లాంచ్ చేయనుంది. నివేదికల ప్రకారం.. ఈ ఏడాది చివరిలో షావోమీ 5జీ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

ఈ కొత్త స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ఈ రెడ్‌మి ఫోన్‌కు పవర్ అందిస్తోంది. క్వాలిటీ 5జీ ఫోన్‌ను రూ. 10వేల లోపు కొనుగోలుదారులకు అందిస్తుంది. రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ ధర ఎంత ఉంటుందో ఇంకా రివీల్ చేయలేదు. షావోమీ 5జీ ఫోన్ స్పెసిఫికేషన్‌లను ఇంకా వెల్లడించలేదు.

అయితే, స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా సపోర్ట్ చేసే ఫీచర్లను అందిస్తున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో రూ. 8వేల కన్నా తక్కువ ధరకు ఈ 5జీ ఫోన్లను పొందవచ్చు. కొత్త 5జీ చిప్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌కు సపోర్టు అందిస్తుంది. మీకు ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. సాధారణంగా, మీరు ప్రస్తుతం హెచ్‌డీ రిజల్యూషన్‌తో ఈ రేంజ్‌లో 4జీ ఫోన్‌లు, ప్రామాణిక 60Hz రిఫ్రెష్ రేట్‌ను పొందవచ్చు. బడ్జెట్ 5జీ ఫోన్‌లలో క్వాల్‌‌‌కామ్ అప్‌గ్రేడ్‌లు వచ్చే అవకాశం ఉంది.

చిప్‌సెట్ స్టోరేజీ విషయానికి వస్తే.. 8జీబీ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 వరకు సపోర్టు ఇస్తుంది. ఇప్పటివరకు బడ్జెట్ ఫోన్‌లు ఈ రేంజ్‌లో 4జీబీ ర్యామ్ లేదా గరిష్టంగా 6జీబీ మెమరీని అందిస్తున్నాయి. అయితే, స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జనరేషన్ 2 పెద్ద అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది. క్వాల్‌కామ్ ద్వారా ఈ ఫోన్లలో గరిష్టంగా 40డబ్ల్యూ స్పీడ్ అందిస్తుంది. అయితే, బడ్జెట్ 5జీ ఫోన్‌లలో 30డబ్ల్యూ అందిస్తుంది. రాబోయే నెలల్లో రెడ్‌మి ఎ4 5జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలను పొందవచ్చు.

Read Also : OnePlus 12R vs OnePlus 12 : వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్లు.. ఈ రెండింటిలో ఏ వన్‌ప్లస్ మోడల్ కొంటే బెటర్ అంటే? ఫుల్ డిటైల్స్ మీకోసం..!