పెట్రోల్‌తో పనిలేదు గాలితోనే పరుగులు : వినూత్న బైక్ తయారీ

చిత్తూరు : పెట్రోల్‌, డీజిల్ లాంటి ఇంధనాలతో పాటు బ్యాటరీ, విద్యుత్, సోలార్‌ ఎనర్జీతో నడిచే వాహనాల గురించి వినే ఉంటారు. కానీ.. సోలార్ ఎనర్జీ, విద్యుత్‌తో పాటు.. విండ్

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 06:57 AM IST
పెట్రోల్‌తో పనిలేదు గాలితోనే పరుగులు : వినూత్న బైక్ తయారీ

Updated On : January 27, 2019 / 6:57 AM IST

చిత్తూరు : పెట్రోల్‌, డీజిల్ లాంటి ఇంధనాలతో పాటు బ్యాటరీ, విద్యుత్, సోలార్‌ ఎనర్జీతో నడిచే వాహనాల గురించి వినే ఉంటారు. కానీ.. సోలార్ ఎనర్జీ, విద్యుత్‌తో పాటు.. విండ్

చిత్తూరు : పెట్రోల్‌, డీజిల్ లాంటి ఇంధనాలతో పాటు బ్యాటరీ, విద్యుత్, సోలార్‌ ఎనర్జీతో నడిచే వాహనాల గురించి వినే ఉంటారు. కానీ.. సోలార్ ఎనర్జీ, విద్యుత్‌తో పాటు.. విండ్ పవర్‌తో నడిచే వాహనం గురించి విన్నారా? మీరెప్పుడైనా చూశారా..? ఇలా మూడు ఎనర్జీలతో నడిచే ఓ వాహనాన్ని రూపొందించాడు చిత్తూరు జిల్లా యువకుడు.

 

పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్ చదివింది కేవలం 7వ తరగతే. కానీ యంత్రాలతో ఆడుకోవడంలో దిట్ట. చిన్నప్పటినుంచి అందుబాటులో ఉన్న యంత్రాలతో రకరకాల ప్రయోగాలు చేయడం అలవాటు.  అందులో భాగంగా గతంలో అనేక ఆవిష్కరణలు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు పవన్. ఈ క్రమంలోనే పెట్రోల్ అవసరం లేకుండా ఓ వినూత్న వాహనాన్ని తయారు చేయాలనుకున్నాడు పవన్. ఇప్పటికే బ్యాటరీ వాహనాలు, సౌర విద్యుత్ వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికంటే కూడా కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచన చేశాడు పవన్. ఇటు సోలార్.. అటు బ్యాటరీతో పాటు…  గాలి మర శక్తినితో కూడా నడిచే వాహనం తయారుచేయాలని సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా తన ప్రయోగం మొదలుపెట్టాడు. అనేక అవాంతరాల తర్వాత ఎట్టకేలకు సక్సెస్ అయ్యాడు. విద్యుత్ శక్తి, గాలి మర శక్తి, సౌర శక్తి.. ఇలా మూడు ఎనర్జీలతో నడిచే విధంగా వినూత్న బైక్‌ని తయారుచేశాడు.

 

* వినూత్న వాహనాన్ని తయారుచేసిన పలమనేరు యువకుడు పవన్‌
* సోలార్‌, విద్యుత్‌తోపాటు గాలిమర శక్తితో పనిచేసే బైక్‌ రూపకల్పన
* ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 80 కి.మీ. దూరం ప్రయాణం
* గతంలో అనేక ఆవిష్కరణలు చేసిన పవన్‌
* ఎండ ఉన్నప్పుడు సౌర శక్తి ఛార్జింగ్ కంట్రోలర్‌కు చేరుతుంది
* వాహనం వెనుక టైర్ల వద్ద ఉండే డీసీ మోటార్ల ద్వారా యాంత్రికశక్తిగా మారి వాహనం ఛార్జవుతుంది
* రాత్రుల్లో వాహనానికి అమర్చిన 4 మైక్రో డైనమోస్ సాయంతో గాలిమరలు తిరిగి వాహనం ఛార్జవుతుంది

 

గతంలోనూ పవన్‌ అనేక ఆవిష్కరణలు చేశాడు. అర్ధరాత్రి వేళ పొలం దగ్గరికి వెళ్లి పంపు సెట్టు ఆన్, ఆఫ్ చేయటానికి రైతులు పడే ఇబ్బంది చూశాడు. అలాంటి వారి కోసం వినూత్న ఆవిష్కరణ చేశాడు. ఇంటి నుంచే రిమోట్ సాయంతో పొలంలోని మోటారును ఆన్, ఆఫ్ చేసే ఓ కొత్త సాధనాన్ని కనుగొన్నాడు. స్వయంగా సీఎం చంద్రబాబు వద్ద దీనిని ప్రదర్శించి ప్రశంసలు సైతం అందుకున్నాడు. తాజాగా ఈ బైక్ రూపొందించి మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు.