YouTube Android : ప్రపంచ జనాభాను దాటేసిన ఆండ్రాయిడ్‌ యూట్యూబ్ డౌన్‌లోడ్స్..!

గూగూల్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ యాప్ ప్రపంచ జనాభాను దాటేసింది. జూలై 2021 నాటికి ప్రస్తుతం ప్రపంచ జనాభా మొత్తం 7.9 బిలియన్లు.. గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఈ ఏడాదిలో 3 బిలియన్ల డివైజ్‌ల్లో యాక్టివ్‌గా కొనసాగుతోంది.

YouTube Android : గూగూల్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ యాప్ ప్రపంచ జనాభాను దాటేసింది. జూలై 2021 నాటికి ప్రస్తుతం ప్రపంచ జనాభా మొత్తం 7.9 బిలియన్లు.. గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఈ ఏడాదిలో 3 బిలియన్ల డివైజ్‌ల్లో యాక్టివ్‌గా కొనసాగుతోంది. అదే గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న యాప్‌ల సంఖ్య కూడా 2.89 మిలియన్లకు పెరిగింది. అయితే గూగుల్ ఆండ్రాయిడ్ యూట్యూబ్ యాప్.. ప్రపంచ జనాభా మొత్తం కన్నా బిలియన్ల సంఖ్యలో డౌన్‌లోడ్ అయింది. Android Google YouTube యాప్ ఇప్పుడు 10 బిలియన్ డౌన్‌లోడ్‌లను దాటేసింది. ఇది ప్రపంచంలోని మొత్తం జనాభా కంటే ఎక్కువ. గూగుల్ యాప్స్ సూట్‌ (Google Suite Apps)లో భాగమైన యూట్యూబ్ యాప్.. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లో కామన్.

ఆ యాప్ ఇప్పుడు 10 బిలియన్లు డౌన్‌లోడ్లను దాటేసింది. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండో పాపులర్ యాప్ అయిన Facebook కంటే కూడా ఎక్కువగా యూట్యూబ్ 7 బిలియన్ల డౌన్‌లోడ్లతో ముందంజలో నిలిచింది. 6 బిలియన్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లతో WhatsApp మూడవ స్థానంలో ఉంది. ఇక ఫేస్‌బుక్ మెసెంజర్ (Facebook Messenger) 5 బిలియన్ల కంటే ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయింది. ఇన్‌స్టాగ్రామ్ (Instagram) 3 బిలియన్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. టిక్‌టాక్ (TikTok) 2 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లతో దూసుకెళ్తోంది.

ప్రముఖ మొబైల్ గేమ్ సబ్వే సర్ఫర్స్ (Subway Surfers) 1 బిలియన్ కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లతో తర్వాతి స్థానంలో ఉంది. ఫేస్‌బుక్ లైట్ (Facebook Lite) కేవలం 2 బిలియన్ డౌన్‌లోడ్‌ల వద్ద ఉండగా.. మైక్రోసాఫ్ట్ వర్డ్ (Microsoft Word) మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ (Microsoft Powerpoint) 2 బిలియన్లకు దగ్గరగా ఉన్నాయి. స్నాప్‌చాట్‌ (Snapchat) ఒక బిలియన్ డౌన్‌లోడ్‌లతో తర్వాతి స్థానంలో ఉంది. నెట్‌ఫ్లిక్స్, ట్విట్టర్ (Netflix, Twitter) వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి 1.5 బిలియన్ల కంటే ఎక్కువ డౌన్‌లోడ్‌లతో తర్వాతి స్థానాలో ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు