YouTube PiP : యూట్యూబ్ బిగ్ అప్‌డేట్.. PIP మోడ్ ఫీచర్ మొబైల్‌లో వచ్చేసింది.. ఫ్రీగా ఎలా వాడాలంటే? ఫుల్ గైడ్

YouTube PiP : ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం యూట్యూబ్ 'PiP' ఫీచర్‌ ఇప్పుడు ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. గతంలో ఈ ఫీచర్ కేవలం అమెరికా యూజర్లకు మాత్రమే ఉచితంగా అందుబాటులో ఉండేది. కానీ, ఇప్పుడు యూట్యూబ్ ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తోంది.

Youtube Picture In Picture

  • మొబైల్ యూజర్ల కోసం యూట్యూబ్ PIP ఫీచర్ ఉచితం
  • ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్ ఎలా వాడాలో తెలుసా?
  • ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికి అందుబాటులోకి

YouTube PiP : యూట్యూబ్ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ప్రత్యేకించి మొబైల్ యూజర్ల కోసం యూట్యూబ్ ఈ ఫీచర్ అందిస్తోంది. మీరు యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా మరో యాప్ ఓపెన్ చేసినా ఈ వీడియో క్లోజ్ కాదు. బ్యాగ్ గ్రౌండ్ రన్ అవుతూనే ఉంటుంది. ఈ ఫీచర్ కోసం ఒకప్పుడు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. కానీ, యూట్యూబ్ ఇప్పుడు మొబైల్ యూజర్ల కోసం ఫ్రీగా అందిస్తోంది.

అదే.. యూట్యూబ్ పాపులర్ ఫీచర్ ‘పిక్చర్-ఇన్-పిక్చర్’ (PiP) మోడ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, iOS యూజర్లందరికి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ PIP ఫీచర్ కేవలం అమెరికాలోని యూజర్లకు లేదా యూట్యూబ్ ప్రీమియం కొనుగోలు చేసిన వారికి మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లందరికి ఉచితంగా లభిస్తుంది.

ఇప్పుడు ఎవరైనా మల్టీటాస్కింగ్ చేస్తూ యూట్యూబ్ వీడియోలను ఎంజాయ్ చేయొచ్చు. మీ యూట్యూబ్ వీడియోను మినిమైజ్ చేసి మీ ఫోన్‌లో ఏదైనా ఇతర యాప్‌ను చూడొచ్చు. ఈ అద్భుతమైన ఫీచర్ ఎలా పనిచేస్తుంది? నిబంధనలేంటి? మీ ఫోన్‌లో ఎలా ఎనేబుల్ చేయాలో పూర్తి స్టోరీ ద్వారా తెలుసుకుందాం..

Read Also : Small UPI Payments : UPIలో గేమ్ చేంజర్ ఫీచర్.. చిన్న పేమెంట్లకు ఇక PIN అవసరం లేదు.. ఎలా వాడాలి?

PiP మోడ్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? :
ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లో ఏ ఇతర యాప్ ఓపెన్ చేసినా కూడా యూట్యూబ్ వీడియోలను చూడొచ్చు. మీకు ఇష్టమైన యూట్యూబ్ వీడియోను ప్లే చేసి ఆపై హోమ్ బటన్‌ ట్యాప్ చేసినా లేదా పైకి స్వైప్ చేసి యాప్ నుంచి బయటకు రావాలి. వీడియో క్లోజ్ కాకుండా చిన్న ఫ్లోటింగ్ విండోగా మారుతుంది.

మీరు ఈ చిన్న స్క్రీన్‌ను ఫోన్ డిస్‌ప్లేలో మీకు నచ్చిన చోటికి మూవ్ చేయొచ్చు. తద్వారా వీడియో చూస్తున్నప్పుడు మీ ఈమెయిల్‌ను చెక్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్‌లో చాట్ చేయవచ్చు.

ఫ్రీ PiP మోడ్ రూల్స్ ఏంటి? :
యూట్యూబ్ ఈ పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP)ఫీచర్‌ను ఫ్రీగా అందిస్తోంది. ఈ ఫీచర్ వ్లాగ్‌లు, పాడ్‌కాస్ట్‌లు, న్యూస్ ట్యుటోరియల్ వీడియోల వంటి లాంగ్ మ్యూజిక్ కాని కంటెంట్‌పై మాత్రమే వర్కౌ అవుతుంది. అంటే.. మీరు ఒక మ్యూజిక్ వీడియోను ప్లే చేసి చిన్న స్క్రీన్‌పై లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయాలంటే ఫ్రీగా సాధ్యం కాదు.

పాటల కోసం మీరు ఇప్పటికీ యూట్యూబ్ ప్రీమియంకు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే ప్రీమియం సర్వీసు కోసం పేమెంట్ చేసేవారికి ఎలాంటి మార్పు ఉండదు. ప్రీమియం మెంబర్స్ పాటలతో సహా అన్ని రకాల వీడియోలపై పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్ బెనిఫిట్ పొందవచ్చు.

మీ ఫోన్‌లో ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలి? :
ఇది గ్లోబల్ అప్‌డేట్.. ప్రపంచవ్యాప్తంగా అందరి యూట్యూబ్ యూజర్లకు అందుబాటులోకి వస్తోంది. ఒకవేళ ఈ ఫీచర్ ఇంకా మీ ఫోన్‌లో కనిపించకపోతే డోంట్ వర్రీ.. కాస్త వెయిట్ చేయండి. ఈ అప్‌డేట్ మీ మొబైల్లో అందుబాటులోకి వచ్చాక ఇలా సింపుల్ గా ఎనేబుల్ చేసుకోవచ్చు.

ముందుగా మీ యూట్యూబ్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. జనరల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీకు పిక్చర్-ఇన్-పిక్చర్ టోగుల్ బటన్ కనిపిస్తుంది. మీరు ఆన్ చేస్తే సరిపోతుంది. మల్టీటాస్కింగ్ ఇష్టపడే వారికి యూట్యూబ్ ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పుడు మీరు వీడియోను స్టాప్ చేయకుండానే మీ ఫోన్‌లో ఒకే టైంలో ఇతర పనులు చేయొచ్చు.