యూట్యూబర్ల‌కు పండగే.. నో రెవిన్యూ షేరింగ్.. మొత్తం మీకే.. వీడియోలపై మరిన్ని యాడ్స్

  • Publish Date - November 22, 2020 / 10:58 AM IST

YouTube Run Ads Without Sharing Revenue : ప్రముఖ గూగుల్ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫాం యూట్యూబ్ లో కొత్త అప్ డేట్ వచ్చింది. నవంబర్ 18,2020న యూట్యూబ్ టెర్మ్స్ ఆఫ్ సర్వీసు కొత్తగా అప్‌డేట్ అయింది. ఈ కొత్త అప్ డేట్ ప్రకారం.. కొందరు యూట్యూబ్ క్రియేటర్లు తమ వీడియోలపై ఎక్కువ యాడ్స్ రన్ చేసుకోవచ్చు.



అంతేకాదు.. ఈ వీడియోలపై జనరేట్ అయ్యే రెవిన్యూలో కొంత మొత్తాన్ని  షేరింగ్ చేయనక్కర్లేదు. యూట్యూబ్ పార్టనర్ ప్రొగ్రామ్‌లో స్మాల్ యూట్యూబ్ క్రియేటర్లు చేరాల్సిన అవసరం లేదని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

అప్‌డేట్ చేసిన టర్మ్స్ ఆఫ్ సర్వీసుల్లో పార్టనర్ ప్రోగ్రామ్.. యూట్యూబ్ Monetization programలో Sign Up చేయాల్సిన అవసరం లేకుండానే స్మాల్ క్రియేటర్ల కంటెంట్‌పై యాడ్స్ ప్లే చేస్తుందని యూట్యూబ్ పేర్కొంది.



అంతకుముందు యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌లో మెంబర్లకు మాత్రమే యాడ్స్ రన్ అయ్యేందుకు అనుమతి ఉండేది. అలాగే ఈ పార్టనర్ ప్రొగ్రామ్ కేవలం అధిక సంఖ్యలో సబ్ స్ర్కైబర్లు, వాచ్ హవర్స్ (Watching Time) పరిమితి ఉన్న వీడియో కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే అనుమతి ఉంది.

YouTube పార్టనర్ ప్రోగ్రామ్‌లో సభ్యత్వం పొందడానికి మీ ఛానెల్‌ నుంచి డబ్బు సంపాదించాలంటే ఒక క్రియేటర్‌కు గత 12 నెలల్లో కనీసం 4,000 పబ్లిక్ వాచ్ హవర్స్ తో పాటు 1000 మంది సబ్ స్ర్కైబర్లు కలిగి ఉండాలి.



YouTube మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు యాడ్స్ నుంచి భారీ మొత్తంలో ఆదాయం లభిస్తుంది. చివరి త్రైమాసికంలో, గూగుల్ యాడ్స్‌పై సుమారు 5 బిలియన్ డాలర్ల వరకు సంపాదించింది.

క్రియేటర్లకు వచ్చే ఆదాయం కూడా ప్రకటన ఆదాయంపైనే వస్తోంది. ఇందులో గూగుల్‌కు రెవిన్యూ షేరింగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కొత్త అప్‌డేట్‌తో కొంతమంది యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లు తమ ఆదాయాన్ని షేరింగ్ చేయాల్సిన అవసరం లేదు.



యూట్యూబ్ తన ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ మొత్తంలో యాడ్స్ రన్ చేస్తుంది. చాలా మంది క్రియేటర్లు తమ ఛానెల్‌ను Ad-free కంటెంట్‌గా సెట్ చేసుకున్నారు. ఈ కొత్త అప్‌డేట్ కారణంగా యూట్యూబ్ వీడియోలపై మరిన్ని యాడ్స్ రన్ చేస్తుంది. తద్వారా క్రియేటర్లు తమ వీడియోలపై Ad-free ఎక్స్ పీరియన్స్ దెబ్బతీసే అవకాశం ఉంది.

ట్రెండింగ్ వార్తలు