Zomato UPI Service Launched, how to activate and more
Zomato UPI Service Launched : ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) తమ కస్టమర్ల కోసం యూపీఐ (UPI Service) సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ యూపీఐ సర్వీసులను ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసా? (Zomato UPI) యూపీఐ సర్వీసుల ద్వారా కస్టమర్లు తమ ఫుడ్ ఆర్డర్లపై సులభంగా పేమెంట్లు చేసుకోవచ్చు. జొమాటో యాప్‌లోనే ఉండి పేమెంట్లు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయడం ద్వారా కొత్త UPI IDని క్రియేట్ చేసుకోవాలి. జొమాటో సొంత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సర్వీసులను ICICI బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రారంభించింది.
జొమాటో కస్టమర్లు ఇకపై యూపీఐ ఐడీ ద్వారా వేగంగా పేమెంట్లు చేసుకోవచ్చు. ఇందుకు జొమాటోలో KYC వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. UPI IDని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. లావాదేవీలను పూర్తి చేసేందుకు ఈ ఫీచర్ చాలా సేఫ్ అని చెప్పవచ్చు. అదనంగా సెక్యూరిటీ పిన్‌ని యాడ్ చేయడం ద్వారా తమ అకౌంట్లను మరింత సేఫ్‌గా చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. జొమాటో యాపీఐ ఎలా పనిచేస్తుంది? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
జొమాటో యూపీఐ సర్వీసు అంటే ఏంటి? :
జొమాటో UPI ద్వారా ఫుడ్ ఆర్డర్ సులభంగా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. జొమాటో యాప్‌లో ఉండే పేమెంట్లు చేసుకోవచ్చు. ఏదైనా బ్యాంక్ అకౌంట్ సేవ్ చేయడం ద్వారా కొత్త UPI IDని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జొమాటో యాప్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్లు చేసే సమయంలో Google Pay, Paytm లేదా PhonePe వంటి UPI ప్లాట్‌ఫారమ్‌లను రీడైరెక్ట్ కాదని గమనించాలి.
Read Also : WhatsApp Chat Lock : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ పర్సనల్ చాట్ ఇలా లాక్ చేయొచ్చు తెలుసా?
జొమాటో తమ ఫుడ్ ఆర్డర్‌ల కోసం యూపీఐ పేమెంట్లు చేసే కస్టమర్‌లను పెద్ద సంఖ్యలో కలిగి ఉంది. వినియోగదారులు జొమాటో యాప్‌లో UPI ఐడిని క్రియేట్ చేయడానికి ICICI బ్యాంకు టెక్నికల్ పార్టనర్ కలిగి ఉంది. తద్వారా కస్టమర్లు ఇతర యాప్‌లను మార్చాల్సిన అవసరం లేకుండా అదే యాప్ నుంచే పేమెంట్లు చేయవచ్చునని కంపెనీ మనీకంట్రోల్‌కి తెలిపింది.
జొమాటో యూపీఐ అందరికీ అందుబాటులో ఉందా? :
ప్రస్తుతానికి, ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే (Zomato UPI) సర్వీసు అందుబాటులో ఉంది. జొమాటో కస్టమర్లు ఈ సర్వీసును స్వీకరించినట్లయితే యాప్ ప్రొఫైల్ విభాగంలో చెక్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ని రాబోయే కాలంలో అందరి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ వాడకం రేటు ఆధారంగా మరిన్ని బ్యాంకులతో భాగస్వామిగా ఉండాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఫీచర్ ఎంత మంది జొమాటో యూజర్లకు అందుబాటులో ఉందో తెలియదు. కానీ, జొమాటో గోల్డ్ యూజర్‌లు తమ యాప్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్ ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి.
జొమాటో యూపీఐ ఎలా యాక్టివేట్ చేయాలి :
జొమాటో యాప్‌ని ఓపెన్ చేసి ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లాలి. (Zomato UPI) సెక్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయవచ్చు. ఇందులో యాక్టివేట్ జోమాటో UPI ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయాలంటే దానిపై క్లిక్ చేయాలి. ప్రైమరీ UPI IDని ఇస్తే సరిపోతుంది. మీరు Zomato UPI IDని యాక్టివేట్ చేసుకునే పేజీలో యాప్ కొన్ని సూచనలను కూడా అందిస్తుంది. ఆ సూచనలను పూర్తి చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకోవాలి. మీ జొమాటో యాప్‌లో సేవ్ చేయాలనుకునే బ్యాంక్‌తో ఇంటిగ్రేట్ అయిన SIM నంబర్‌ని ఎంచుకోవాలి. ఆ తర్వాత, త్వరగా పేమెంట్లు చేయడానికి ఏదైనా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి.
Read Also : Motorola Edge 40 Launch : మోటోరోలా ఎడ్జ్ 40 ఫోన్ వచ్చేస్తోంది.. మే 23నే లాంచ్.. కీలక ఫీచర్లు ఇవే..!