Idol stolen: సిద్దిపేట జిల్లాలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ.. రూ.కోటి విలువచేసే విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో ఉండే వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఏడు శతాబ్దాలుగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న దాదాపు రూ.కోటి విలువచేసే విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాన్ని తెరిచే సమయానికి విగ్రహం కనిపించలేదు. దీనిపై వేణుగోపాల స్వామి ఆలయ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. చోరీ చేసిన ఆ విగ్రహం 700 ఏళ్లనాటి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహం అని వివరించారు.

Idol stolen: సిద్దిపేట జిల్లాలోని వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ.. రూ.కోటి విలువచేసే విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

Idol stolen

Updated On : September 30, 2022 / 8:30 AM IST

Idol stolen: సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లో ఉండే వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఏడు శతాబ్దాలుగా ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్న దాదాపు రూ.కోటి విలువచేసే విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయాన్ని తెరిచే సమయానికి విగ్రహం కనిపించలేదు. దీనిపై వేణుగోపాల స్వామి ఆలయ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. చోరీ చేసిన ఆ విగ్రహం 700 ఏళ్లనాటి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహం అని వివరించారు.

ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. చోరీ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి వారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వారిని పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వేణుగోపాల స్వామి ఆలయంలో చోరీ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Heavy rainfall in Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు