YS Sharmila : చంచల్‌గూడ జైలుకి వైఎస్ షర్మిల.. 14రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

YS Sharmila: పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో ఏ-1 గా షర్మిల, ఏ2గా బాబు (షర్మిల డ్రైవర్), ఏ-3గా జాకబ్ (పరార్) ను చేర్చారు పోలీసులు.

YS Sharmila : చంచల్‌గూడ జైలుకి వైఎస్ షర్మిల.. 14రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

YS Sharmila

Updated On : April 24, 2023 / 11:00 PM IST

YS Sharmila : పోలీసులపై దాడి కేసులో అరెస్ట్ అయిన వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ (మే 8వ తేదీ వరకు) విధించింది. మరోవైపు షర్మిల తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. షర్మిల బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది.

అనంతరం తదుపరి విచారణ రేపటికి (ఏప్రిల్ 25) వాయిదా వేసింది. దాంతో పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకి తరలించారు. ఈ కేసులో ఏ-1 గా షర్మిల, ఏ2గా బాబు (షర్మిల డ్రైవర్), ఏ-3గా జాకబ్ (పరార్) ను చేర్చారు పోలీసులు.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై దాడి చేసినట్లు షర్మిలపై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి.

Also Read..YS Sharmila : అందుకే అరెస్ట్.. షర్మిల వ్యవహారంపై సీపీ సీవీ ఆనంద్ రియాక్షన్

షర్మిల తరపు న్యాయవాది..
TSPSC పేపర్ లీకేజ్ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను అడ్డుకున్నారు. షర్మిలను ప్రతిసారి పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. షర్మిలతో దురుసుగా ప్రవర్తించింది పోలీసులే. 41 crpc నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా ఆరెస్ట్ చేశారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్నీ బిలో ఏడు సంవత్సరాల శిక్ష మాత్రమే. రిమాండ్ రిజెక్ట్ చెయ్యాలని కోరుతున్నాం. బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నాం. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ పోలీసులు టచ్ చేశారు. దర్యాప్తునకు సహకరిస్తాం.

షర్మిల వాదనలు..
ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా నా ఇంటి మీదకి పోలీసులు వచ్చారు. ఎలాంటి అరెస్ట్ నోటీసు ఇవ్వలేదు. మగ పోలీసులు నాతో దురుసు గా ప్రవర్తించారు. నన్ను తాకే ప్రయత్నం చేశారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేశాను.