YS Sharmila : అందుకే అరెస్ట్.. షర్మిల వ్యవహారంపై సీపీ సీవీ ఆనంద్ రియాక్షన్

YS Sharmila : విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారని సీరియస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

YS Sharmila : అందుకే అరెస్ట్.. షర్మిల వ్యవహారంపై సీపీ సీవీ ఆనంద్ రియాక్షన్

YS Sharmila

YS Sharmila : వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ వ్యవహారంపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై పరిశీలిస్తున్నామని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

షర్మిల అరెస్ట్ వ్యవహారంపై వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ కూడా స్పందించారు. షర్మిల.. సెక్రటేరియట్, సిట్ ఆఫీసుకి వెళ్తున్నారనే సమాచారంతో హౌస్ చేయటానికి పోలీసులు ప్రయత్నించారని డీసీపీ జోయల్ డేవిస్ చెప్పారు. కొందరు పోలీసులపై షర్మిల దాడి చేసిన విజువల్స్ తామూ చూశామన్నారు. దాడికి గురైన పోలీసులతో ఫిర్యాదు తీసుకుని షర్మిలపై కేసు నమోదు చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.(YS Sharmila)

Also Read..YS Sharmila Arrested : పోలీసుల్ని నెట్టేసి .. మహిళా కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన షర్మిల

లోటస్ పాండ్ నుంచి సిట్ ఆఫీసుకు షర్మిల బయలుదేరారు. అయితే, ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఓ సందర్భంలో విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో ఒక్కసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించారు షర్మిల. దీన్ని పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read..YS Vijayamma : వాస్తవాలను చూపించండీ, పోలీసులు చేసింది కూడా చూపించండీ : మీడియాకు విజయమ్మ విజ్ఞప్తి

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారి విధులకు ఆటంకం కలిగించారని కేసులు నమోదు చేశారు. సీరియస్ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఉదయం నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో షర్మిలను ఉంచారు పోలీసులు. అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.(YS Sharmila)

అసలేం జరిగింది..
ఈ ఉదయం షర్మిత లోటస్ పాండ్ లోని తన నివాసం నుంచి సిట్ కార్యాలయానికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సిట్ ఆఫీసుకి వెళ్లడానికి అనుమతి లేదంటూ షర్మిలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ వారితో గొడవ పెట్టుకున్నారు. తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులను తోసుకుంటూ కారు దగ్గరికి చేరుకునే క్రమంలో షర్మిల పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు.

ఈ క్రమంలో సహనం కోల్పోయిన షర్మిల ఓ మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. మరో మహిళా కానిస్టేబుల్ ను నెట్టివేశారు. ఓ పోలీస్ ను తోసివేశారు. ఓ ఎస్ఐని కొట్టారు. చెంప చెళ్లుమనిపించారు. షర్మిల తీరుతో పోలీసులు నివ్వెరపోయారు. విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై షర్మిల చేయి చేసుకోవడం దుమారం రేపింది. దీన్ని పోలీసు డిపార్ట్ మెంట్ సీరియస్ గా తీసుకుంది. పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 332, 353, 509, 427 వంటి కఠిన ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. (YS Sharmila)

మరోవైపు పోలీసుల తీరుపై షర్మిల ఫైర్ అయ్యారు. తనను బయటికి వెళ్లనివ్వకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను ఏమైనా క్రిమినల్ నా? హంతకురాలినా? అని అడిగారు. నాకు వ్యక్తిగత స్వేచ్చ లేదా? అని నిలదీశారు. తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు ఎందుకు పహారా కాచారో చెప్పాలన్నారు. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తన బాధ్యత అన్నారామె. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారని షర్మిల ప్రశ్నించారు.

ఇక షర్మిల కోసం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన వైఎస్ విజయమ్మ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. తనను పోలీస్ స్టేషన్ లోకి అనుమతించని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. విజయమ్మను బలవంతంగా అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ పై విజయమ్మ చెయ్యి చేసుకున్నారు. పోలీసులను నెట్టివేశారు.