తెలంగాణలో కరోనా నుంచి 1,166 మంది కోలుకున్నారు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా రోజురోజుకు పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తుంది. లేటెస్ట్‌గా 1590 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,902కి చేరుకుంది. రాష్ట్రంలో మరో ఏడుగురు చనిపోగా.. కరోనా మృతుల సంఖ్య 295కి పెరిగింది.
అయితే రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది. గత 24గంటల్లో 1,166 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దాంతో మొత్తం 12,703 మంది కోలుకున్నట్టుగా అయ్యింది.
ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య 10,703గా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. హైదరాబాద్, పరిసరాల్లో గడచిన 24 గంటల్లో 1,277 మందికి కరోనా నిర్ధారణ అయింది. మేడ్చెల్ జిల్లాలో 125 మందికి, రంగారెడ్డి జిల్లాలో 82 మందికి కరోనా సోకింది.