గంటల వ్యవధిలో 4వేల కోళ్లు మృతి.. పెద్దపల్లి జిల్లాలో కలకలం

4 thousand hens die: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 4వేల నాటుకోళ్లు మరణించాయి. గంటల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం దాణా తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కోళ్లన్నీ మరణించడంతో యజమానులు ఆవేదన చెందారు.
కోళ్ల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత పడ్డాయని స్థానికులు భయపడ్డారు. చివరికి రాణికెట్ అనే వ్యాధితో కోళ్లు చనిపోయినట్లు తేల్చారు. ఈ వ్యాధి వచ్చిన కోళ్ల రెక్కలు నేల వాలుతాయి. కాళ్లు, మెడ చచ్చుబడి దాదాపు పక్షవాతంలా వస్తుంది. ఆ తర్వాత చనిపోయితా. ఒక్క కోడికి వస్తే.. చుట్టూ ఉన్న అన్ని కోళ్లకూ వ్యాపిస్తుంది. అయితే ఈ వ్యాధితో మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు.