హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఓ లారీ స్కూల్ ఆటోను ఢీకొంది. ఉదయం 9 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో అనంతకుమార్ అనే స్కూల్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పల్ రింగ్ రోడ్ సమీపంలో ఉన్న లిటిల్ ఫ్లవర్ కాలేజీ వద్ద విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూల్ ఆటోను వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అనంతకుమార్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఐదుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తన్నారు. అరంతనం ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వేగంగా వచ్చిన లారీ ఎనిమిదిమంది విద్యార్దులతో వెళ్తున్న ఆటోను ఢీకొనటంతో ఆటో ఎగిరిపడ్డ ఆటోలోంచి పడిపోయిన అనంతకుమార్ తల లారీ చక్రాల కింద పడి నుజ్జు నుజ్జు అయిపోయింది. దీంతో 7వ తరగతి చదివే అనంత కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతివేగంగా నడిపిన లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.