Amberpate Inspector Cheating : ఎన్ఆర్ఐకి భూమి ఇప్పిస్తానని మోసం.. అంబర్ పేట ఇన్ స్పెక్టర్ పై కేసు నమోదు
హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

SUDHAKAR
Amberpate Inspector Cheating : హైదరాబాద్ అంబర్ పేట్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ పై కేసు నమోదు అయింది. ల్యాండ్ వ్యవహారంలో సుధాకర్ పై వనస్థలీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మహేశ్వరంలో భూమి ఇప్పిస్తానని ఓ ఎన్ఆర్ఐని సుధాకర్ మోసం చేశారు. నకిలీ ఎమ్మార్వోను సృష్టించి ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు కాజేశారు.
Bengaluru : చీటింగ్ కేసులో నటుడు నిర్మాత అరెస్ట్
సస్పెండ్ అయిన ఓ ఆర్ఐతో కలిసి ఇన్ స్పెక్టర్ సుధాకర్ ల్యాండ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. ఆ ఎన్ఆర్ఐ నుంచి ఇన్ స్పెక్టర్ సుధాకర్ రూ.54 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు సుధాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.