ఆన్‌లైన్ లోన్‌యాప్స్ వేధింపులకు మరో యువకుడు బలి

A young man commits suicide by online loan apps harassed : ఆన్‌లైన్ లోన్‌యాప్స్ దురాగతానికి మరో యువకుడు ప్రాణం తీసుకున్నాడు. ఆన్‌లైన్ లోన్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ రెడ్డి అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. పవన్ కళ్యాణ్ రెడ్డి.. కొద్ది రోజుల క్రితం ఆన్‌లైన్ యాప్స్‌లో లోన్ తీసుకున్నాడు.
అయితే లోన్ కట్టాలంటూ వేధింపులు పెరడంతో పాటు కంటాక్ట్‌లోని ఇతరులకు మెసేజ్‌లు పంపుతుండటంతో తీవ్ర మనోవేదనకు గురైన పవన్ కళ్యాణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లోన్ యాప్ వేధింపులు బరించలేకనే పవన్ కళ్యాణ్ రెడ్డి ప్రాణాలు తీసుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.