Abdullapurmet Incident : నవీన్ హత్య కేసు.. వెలుగులోకి మరో ఫోన్ ఆడియో, తనకేమీ తెలియనట్లు నటించిన హరి

నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.

Abdullapurmet Incident : నవీన్ హత్య కేసుకు సంబంధించి స్నేహితుల ఫోన్ కాల్ సంభాషణలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ గురించి తనకు తెలియదన్నాడు హరిహర కృష్ణ. వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించాడు. నవీన్ ఫ్రెండ్ మహిపాల్ తో హరి సంభాషణ ఆడియో బయటకు వచ్చింది.

Also Read..Abdullapurmet Incident : నవీన్ కేసు విచారణలో షాకింగ్ విషయాలు.. హత్య ఎలా చేయాలో యూట్యూబ్ లో సెర్చ్ చేసిన హరి

నవీన్‌ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ.. నవీన్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆడియో వైరల్‌గా మారింది. నవీన్‌ను హత్య చేసి తనకేమీ తెలియనట్లుగా కృష్ణ వ్యవహరించాడు. తన ప్రేయసి విషయంలో తగాదా వచ్చిందని, డ్రగ్స్‌ తాగుతానని నవీన్‌ అన్నట్లు, నవీన్‌పై మిస్సింగ్‌ కేసు పెడదామంటూ తన మీద అనుమానం రాకుండా నవీన్‌ ఫ్రెండ్‌ మహిపాల్ తో హరిహర ఫోన్ లో మాట్లాడాడు. ఇప్పుడీ ఆడియో వైరల్ గా మారింది.

Also Read..Abdullapurmet Incident : హత్య చేసి మర్మాంగాన్ని కోసి.. నవీన్ మర్డర్ కేసులో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు

ప్రేమించిన యువతికి స్నేహితుడు నవీన్ దగ్గర అవడాన్ని జీర్ణించుకోలేకపోయిన హరిహర కృష్ణ.. కక్ష పెంచుకున్నాడు. పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ హత్యకు స్కెచ్ వేశాడు. పార్టీ పేరుతో నవీన్ ను పిలిపించాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత శరీర భాగాలను వేరు చేశాడు. గుండె, తల, మొండెం, కాళ్లు చేతులను వేరు చేయడమే కాదు వాటి ఫొటోలను వాట్సాప్‌ ద్వారా ప్రియురాలికి పంపి పైశాచికానందం పొందాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

నవీన్, హరి ఇద్దరూ ఒక కాలేజీలో చదువుకుంటున్నారు. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. అయితే, ఒకే అమ్మాయిని ప్రేమించారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రేమించిన అమ్మాయిన దక్కించుకునేందుకు నవీన్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్న హరి 3నెలల నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరించాడు. హత్య తర్వాత హరి తీరును చూసిన పోలీసులే విస్తుపోయారు.

హరి హర కృష్ణ మానసిక స్థితి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంత క్రూరంగా చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. క్రైమ్ వెబ్ సీరిస్ లు, యూట్యూబ్ చూసి హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్యకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఇప్పటికే సేకరించిన పోలీసులు.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.