Formual E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ, ఈడీ ప్రశ్నల వర్షం

సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్ మెంట్ ఈ కేసుకు కీలకం కానుందని అధికారులు భావిస్తున్నారు.

Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణలో ఈడీ, ఏసీబీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. బీఎల్ఎన్ రెడ్డిని ఈడీ, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. కీలక విషయాలపై వీరిద్దరిని ఏసీబీ, ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనపైన బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

ప్రభుత్వ ఖజానా దుర్వినియోగంపై ఈడీ ఎంక్వైరీ..
ప్రభుత్వ ఖజానా దుర్వినియోగంపైన బీఎల్ఎన్ రెడ్డిని ఎంక్వైరీ చేస్తున్నారు ఈడీ అధికారులు. విదేశీ కంపెనీకి నిధుల బదలాయింపుపైన సమగ్రంగా ఈడీ అధికారులు కూపీ లాగుతున్నారు. మరోవైపు అరవింద్ కుమార్ నుంచి కీలక విషయాలను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చే స్టేట్ మెంట్ ఈ కేసుకు కీలకం కానుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read : ఏపీ ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలు.. ఫస్టియర్ సంవత్సరాంతర పరీక్షలు తొలగిస్తాం: కృతికా శుక్లా

కీలకంగా మారనున్న ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్ మెంట్..
ఈ కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బీఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్లు గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. తాజాగా ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు.

హెచ్ఎండీఏ నుంచి నిధులు ఎందుకు బదిలీ చేశారు? ఎవరు చెబితే ట్రాన్సఫర్ చేశారు?
హెచ్ఎండీఏ నుంచి నిధులు ఎందుకు బదిలీ చేశారు? ఎవరు చెబితే మీరు నిధులను ట్రాన్సఫర్ చేశారు? దీనికి లిఖితపూర్వక ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ లిఖితపూర్వక ఆదేశాలు లేకుంటే నిధులు ఎందుకు బదిలీ చేశారు?

మౌఖిక ఆదేశాలతోనే నిధులను బదిలీ చేయొచ్చనే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఆర్థికశాఖ అనుమతి లేకుండా నిధులు ఎందుకు బదిలీ చేశారు? దీనికోసం డబ్బును ఏ విధంగా సమకూర్చారు? ఏ బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ చేశారని అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది?

ఫెమా నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారు?
ఫెమా నిబంధనలను ఎందుకు ఉల్లంఘించారు? ఐటీ శాఖ మీకు ఎందుకు 8 కోట్ల రూపాయల జరిమానా విధించింది? నిధుల బదిలీ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా? ఒకవేళ తీసుకెళితే ప్రభుత్వం ఎలా స్పందించింది? కారు రేసు ఒప్పందం చేసుకున్నది ఎవరు? దీనికి క్యాబినెట్ అనుమతి ఉందా? ఈ అంశాలపై వారిద్దరి నుంచి అధికారులు కీలక వివరాలు రాబట్టే అవకాశం ఉంది. (Formual E Car Race Case)

 

Also Read : కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీని నడిపించేది వీళ్లేనా? కేసీఆర్‌ ఎవరి వైపు మొగ్గు చూపుతారు..?