KTR: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. కేటీఆర్ కి మరోసారి ఏసీబీ నోటీసులు

పలు కార్యక్రమాల నిమిత్తం లండన్, అమెరికా వెళ్లాల్సి ఉందన్న కేటీఆర్.. తాను తిరిగి హైదరాబాద్ వచ్చాక వెంటనే ఏసీబీ విచారణకు..

Formula E-Car Race Case

KTR: తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మళ్లీ కలకలం రేగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఈ కేసులో ఏసీబీ మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు కేటీఆర్ ఎక్స్ లో తెలిపారు. ముందుగానే నిర్ణయించబడ్డ పలు కార్యక్రమాల నిమిత్తం లండన్, అమెరికా వెళ్లాల్సి ఉందన్న కేటీఆర్.. తాను తిరిగి హైదరాబాద్ వచ్చాక వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతానంటూ కేటీఆర్ ఏసీబీ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం.

”ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ACB నాకు నోటీసు ఇచ్చింది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను కచ్చితంగా విచారణ ఏజెన్సీలకు సహకరిస్తా. నేను చాలా ముందుగానే పలు కార్యక్రమాల కోసం లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను.
నేను తిరిగి వచ్చిన వెంటనే ఏసీబీ విచారణకు హాజరవుతాను. ACB అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాను.

Also Read: హైదరాబాద్‌లో రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. వారికికూడా కార్డులు వచ్చేస్తున్నాయ్.. పంపిణీ ఎప్పుడంటే..?

48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ED ఛార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కనిపించింది. 24 గంటల తర్వాత రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో సహా బీజేపీ అగ్ర నాయకులతో బాతాకానీ పెడుతూ కనిపించారు. మనీలాండరింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని ఒక్క బీజేపీ నాయకుడు కూడా రేవంత్ రెడ్డిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు కేటీఆర్.

ఏసీబీ నోటీసులపై స్పందించారు కేటీఆర్. ఈ నెల 28న విచారణకు హాజరు కాలేనని ఏసీబీకి ఆయన లేఖ రాశారు. తనకు మరికొంత సమయం కావాలని లేఖలో ఏసీబీని కోరారాయన. ముందే నిర్ణయించిన షెడ్యూల్ వల్ల యూకే, యూఎస్ఏ వెళ్తున్న నేపథ్యంలో తాను ఈ నెల 28న విచారణకు రాలేనని తెలిపారు. విదేశాలను నుంచి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు.