Site icon 10TV Telugu

సినీ నటి కల్పికపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నతండ్రి..

Case registered against actress Kalpika at Gachibowli ps

Actress Kalpika: సినీ నటి కల్పికపై ఆమె తండ్రి గణేశ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా తమ కుమార్తె ఆరోగ్యం బాగుండటం లేదని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా సినీ నటి కల్పిక తీరు వివాదాస్పదంగా మారి విమర్శలకు దారితీస్తోంది. తాజాగా తన కుమార్తె కల్పిక మానసిక పరిస్థితి బాగోలేదంటూ తండ్రి గణేశ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. కోర్టు ఆదేశాల మేరకు కల్పికకు ట్రీట్ మెంట్ అందించే విధంగా చూస్తామని ఆమె తండ్రికి భరోసా ఇచ్చారు పోలీసులు.

కూతురి మానసిక ఆరోగ్య పరిస్థితిని పరిష్కరించడంలో సాయం కోరుతూ నటి కల్పిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తన కుమార్తె తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతోందని.. ఆమె తనకు, తన కుటుంబానికి, ప్రజలకు ముప్పు కలిగిస్తుందని తండ్రి గణేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కల్పిక గతంలో చికిత్స కోసం పునరావాస కేంద్రంలో చేరిందని తండ్రి గణేశ్ గుర్తు చేశారు.

గత రెండేళ్లుగా వైద్యులు సూచించిన మందులు తీసుకోవడం ఆమె మానేసిందన్నారు. దీని ఫలితంగా కల్పిక తరచుగా నిరాశగా ఉంటోందన్నారు. ఆమె ప్రవర్తన దూకుడుగా ఉంటోందని, బహిరంగంగా ఇబ్బంది కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. తన కూతురి విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన పోలీసులను అభ్యర్థించారు. కల్పిక భద్రత, ఇతరుల శ్రేయస్సు కోసం ఆమెను తిరిగి పునరావాస కేంద్రంలో చేర్చడానికి సాయం చేయాలని పోలీసులను కోరారు.

నటి కల్పిక వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. తన చేష్టలతో నాన్ సెన్స్ చేస్తుందనే విమర్శలు ఎదుర్కొంటోంది. అకారణంగా ఎదుటి వారితో ఆమె గొడవలు పెట్టుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. నెల రోజుల క్రితం గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో అర్థరాత్రి నటి కల్పిక హంగామా చేసింది. ఈ విషయమై ఆమెపై పోలీసులు కేసు కూడా పెట్టారు. అది ఇంకా విచారణలో ఉంది. ఇప్పుడు మరోసారి మొయినాబాద్‌లో ఉన్న ఓ రిసార్ట్‌లో హడావుడి చేసింది. దీనికి బంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మొయినాబాద్‌ ప్రాంతంలో ఉన్న రిసార్ట్‌కి మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్యాబ్‌లో ఒంటరిగా వచ్చిన కల్పిక.. రిసెప్షన్‌లో అడుగు పెట్టగానే మేనేజర్ పై దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మెనూ కార్డ్ విసిరేయడం, రూమ్ తాళాలను మేనేజర్ ముఖంపై విసరడం, అసభ్యంగా బూతులు మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించడం లాంటివి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

Also Read: పవర్ స్టార్ ఈ వీడియో ఎప్పుడు చేశారు? ఇంత సరదాగా.. వీడియో వైరల్.. ఈ హీరోయిన్స్ లో పవన్ కి ఎవరంటే ఇష్టం?

Exit mobile version