CM KCR : త్వరలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతాయి..! కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

త్వరలోనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని బాంబు పేల్చారు కేసీఆర్. ఇప్ప‌టికే పేద‌ల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నిక‌లు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుంద‌ని..

Cm Kcr Petrol Rates

 

CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీతో సమరానికి సై అంటున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కేసీఆర్.. మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ (బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే) అంటూ నినదించారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని కేసీఆర్ అన్నారు.

మరోవైపు.. త్వరలోనే మళ్లీ పెట్రోల్ రేట్లు పెరుగుతాయని బాంబు పేల్చారు కేసీఆర్. ఇప్ప‌టికే పేద‌ల నోరు కొడుతున్న బీజేపీ.. యూపీ ఎన్నిక‌లు అయిన తెల్లారే పెట్రోల్ రేట్లు పెంచుతుంద‌ని చెప్పారు. ఇదంతా మోదీ నాయ‌కత్వంలోని బీజేపీ అప్ర‌జాస్వామిక చ‌ర్య అని మండిప‌డ్డారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రం పెట్రోల్ ధరలను తగ్గించిందన్న కేసీఆర్.. 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరమే దేశవ్యాప్తంగా మళ్లీ పెట్రోల్ రేట్లను కేంద్రం పెంచుతుందన్నారు. కచ్చితంగా పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న కేసీఆర్.. ఇది రాసి పెట్టుకోండి అంటూ మీడియా ప్రతినిధులకు చెప్పారు.

Realme C35 Phone : రూ.13 వేలకే రియల్‌మీ కొత్త ఫోన్.. 50MP ట్రిపుల్ కెమెరా..!

ఎన్నిక‌ల్లో గెల‌వ‌కున్నా ప‌రిపాలించే సిగ్గులేని పార్టీ బీజేపీ అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ”క‌ర్నాట‌క‌, మధ్యప్రదేశ్, మణిపూర్ లో గెల‌వలేదు, కానీ ప‌రిపాలిస్తున్నారు. గోవాలో గెల‌వ‌లేదు కానీ నిన్న‌టి దాకా ప‌రిపాలించారు. మ‌హారాష్ట్ర‌లో గెల‌వ‌లేదు.. చీకట్లో దొంగ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. తెల్లారెస‌రికి వాడు ఎదురు తంతె సిగ్గుమానం తీసుకున్న‌ారు. మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ప‌రువు పోలేదా? మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ఆడిన నాట‌కంపై చ‌ర్చ పెడ‌దామా?

ఓట‌మిని అంగీక‌రించే స‌హ‌నం ఉండాలి. అన్ని గెల‌వం. రాజ‌కీయాలు అన్నాక‌, ఎన్నిక‌లు అన్నాక అక్క‌డ ఉండే ప‌రిస్థితుల‌ను బట్టి కొన్ని గెలుస్తాం. కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు? ఓడిపోయినంత మాత్ర‌న ఈ అడ్డ‌దారులు ఎందుకు? దేశాన్ని న‌డిపించే ప‌ద్ధ‌తి ఇదేనా? ఈ ప‌ద్ద‌తిలోనేనా దేశం బాగుప‌డేది. అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయి. స‌బ్సిడీలు క‌ట్ చేస్తున్న‌ారు. పేద‌ల నోరు క‌డుతున్న‌ారు. ఇప్పుడు మ‌ళ్లీ బీజేపీ.. గొడ్డ‌లి భుజాల మీద పెట్టుకుని తిరుగుతోంది. యూపీ ఎన్నికల్లో ఓట్లు డ‌బ్బ‌ాలో ప‌డ్డ తెల్లారే పెట్రోల్ రేట్లు మ‌ళ్ల పెంచుతారు. ఇదంతా మోదీ నాయ‌కత్వంలోని బీజేపీ అప్ర‌జాస్వామిక చ‌ర్య” అని మండిప‌డ్డారు కేసీఆర్.

”నన్ను జైలుకు పంపుతామని అంటున్నారు. వీళ్లను చూస్తే నిజంగా జాలి కలుగుతుంది… దమ్ముంటే నన్ను జైల్లో వేయండి. మమ్మల్ని కాదు… మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ గురించి రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. మోదీ సర్కారు దీంట్లో వేల కోట్లు మింగింది. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతాం.

Sleep : అతిగా నిద్రపోతున్నారా!…అయితే జాగ్రత్త?

కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధ విమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధ విమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొంది. మనకంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడం లేదా ఎవడు దొంగ అనేది? ఎవడు జైలుకు పోతాడో అనేది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం” అని సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.