My Home Sayuk: మైహోమ్ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. నేడు బ్రోచర్‌ను ఆవిష్కరించనున్న అల్లు అర్జున్

హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద ‘మైహోమ్ సయుక్’ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుంది.

My Home Sayuk: మైహోమ్ సంస్థ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్.. నేడు బ్రోచర్‌ను ఆవిష్కరించనున్న అల్లు అర్జున్

My Home (1)

Updated On : June 9, 2022 / 11:49 AM IST

My Home Sayuk: హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద ‘మైహోమ్ సయుక్’ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం కాబోతుంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంచ్ చేయనున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవటంతోపాటు, హెల్దీ లైఫ్ స్టైల్ కోరుకొనే వారికి ఈ మెగా ప్రాజెక్ట్ కేంద్రంగా కాబోతుంది.

 

My Home

కస్టమర్ల నమ్మకం, నాణ్యమైన ఇంటి నిర్మాణమే లక్ష్యంగా నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మై హోమ్ సంస్థ.. కస్టమర్లకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాస గృహాన్ని అందించేందుకు ‘మైహోమ్ సంయుక్’ ప్రాజెక్టును తీసుకొస్తుంది. ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ద్వారా 10వేల మంది సొంతింటి కలను నెరవేర్చేందుకు మైహోం సంస్థ సిద్ధమైంది.

My Home (2)

25.37 ఎకరాల్లో, 82శాతం పచ్చదనంతో నివాసదారులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ మైహోమ్ సయుక్ ప్రాజెక్టును మైహోమ్ సంస్థ చేపడుతుంది. ఇందులో మొత్తం 12టవర్లు నిర్మాణం కానున్నాయి. జీప్లస్ 39 ఫ్లోర్స్ తో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టు లో కేవలం 5.37 ఎకరాల్లోనే ప్లాట్స్ నిర్మాణం చేపట్టనున్నారు. మిగిలిన 20 ఎకరాల్లో ఓపెన్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించి మనస్సుకు ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా తీర్చిదిద్దనున్నారు.

My Home (4)

ఈ ప్రాజెక్టులో 7.5ఎకరాల్లో సెంట్రల్ ల్యాండ్ స్కేప్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఎన్నో చెట్లు, మొక్కలు, పూల మొక్కలు నాటనున్నారు. అంతేకాక అవుట్ డోర్ చెస్, అవుట్ డోర్ లూడో, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాలీబాల్ కోర్ట్, అవుట్ డోర్ బ్యాడ్మింటెన్ కోర్ట్, బాస్కెట్ బాల్ కోర్ట్, సైక్లింగ్, జాగింగ్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయి. దీనికితోడు అన్ని హంగులతో 1లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌజ్ ను కూడా మైహోమ్ సంస్థ కస్టమర్లకు అందుబాటులో తేనుంది. ఇందులో అందమైన లాబీతో పాటు మల్టీపర్పస్ హాల్, సూపర్ మార్కెట్, గెస్ట్ రూమ్స్ రానున్నాయి. వీటితో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించనున్నారు. క్లబ్ హౌస్ టెర్రస్ మీద టెన్నీస్ కోర్టులను అందుబాటులోకి తేనున్నారు.

My Home (5)

ఈ మైహోమ్ సయుక్ ప్రాజెక్ట్ లో కళ్లు చెదిరే సకలసౌర్యాలతో 3,780 ప్రీమియం ఫ్లాట్స్ అందుబాటులోకి రానున్నాయి. 1355 చదరపు అడుగుల విస్థీర్ణంలో డబుల్ బెడ్రూం, 1573 చదరపు అడుగుల విస్థీర్ణంలో 2.5 బెడ్రూం, 1926 మరియు 2262 చదరపు అడుగుల విస్తీర్ణంలో ట్రిపుల్ బెడ్రూంలు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. మహానగరానికి అతి దగ్గరలో నే మైహోమ్ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును నిర్మాణం చేపట్టనుంది. హైటెక్ సిటీ నుంచి పది నిమిషాల్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ నుంచి ఐదు నిమిషాల్లో “మైహోమ్ సయుక్”కు చేరుకోవచ్చు.

My Home (3)