హైదరాబాద్ లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 02:03 AM IST
హైదరాబాద్ లో మరో ఇద్దరికి కరోనా లక్షణాలు

Updated On : March 14, 2020 / 2:03 AM IST

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దుబాయ్, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలకు కరోనా వైరస్ లక్షణాలున్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. థర్మల్ స్క్రీనింగ్ టెస్టులో కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వారిని హుటాహుటిన చికిత్స కోసం అంబులెన్స్ లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

28, 48 సంవత్సరాల వయస్సు కలిగిన ఇద్దరు మహిళలను గుర్తించారు. ఐసోలేషన్ వార్డులో ఇద్దిరికి చికిత్స అందించనున్నారు. వారి శాంపిల్స్ సేకరించి పూణెకు పంపించారు. అయతే వీరు ఎక్కడి నుంచి వచ్చారు..ఎవరెవరిని కలిశారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. (కరోనా కేర్ : ఆ ఏడు దేశాల నుంచి వచ్చే వారిని అనంతగిరి రిసార్ట్ కే)

తెలంగాణలో ఇప్పటివరకు కరోనా లక్షణాలు కలిగిన ఎలాంటి కేసులు నమోదు కాలేదు కానీ విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. కరోనా లక్షణాలున్న వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్ లో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. 78 కరోనా కేసులు నమోదు అయ్యాయి.