కేసీఆర్‌కు ఆరూరి రమేశ్‌ షాక్.. బీజేపీలో చేరడానికి ఢిల్లీకి పయనం

బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు ఆరూరి రమేశ్.

Aroori Ramesh

బీఆర్ఎస్ అధిష్ఠానానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ షాక్ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరనున్నారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంపై బీఆర్ఎస్‌లో కొందరు నేతలు అసంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఢిల్లీకి వెళ్లారు ఆరూరి రమేశ్. బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు ఆరూరి రమేశ్. ఆయనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బీజేపీలో చేరారు.

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ నిన్న రెండో జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఆ ఆరుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన వారే. ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను బీజేపీ పెండింగ్‌లో ఉంచింది. ఈ రెండు స్థానాల్లో పోటీపై కూడా త్వరలోనే స్పష్టత రానుంది.

గీతాంజలి కేసులో టీడీపీ కార్యకర్త రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు

ట్రెండింగ్ వార్తలు